BigTV English

Darshan Fan Suicide: స్టార్ హీరో దర్శన్ అరెస్టు.. మనస్థాపంతో అభిమాని ఆత్మహత్య

Darshan Fan Suicide: స్టార్ హీరో దర్శన్ అరెస్టు.. మనస్థాపంతో అభిమాని ఆత్మహత్య

Fan Suicide for Kannada Hero Darshan Arrest in Renuka Swamy Murder Case: ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా కన్నడ స్టార్ హీరో దర్శన్ పేరే. తన అభిమాని హత్య కేసులో ఈ ఛాలెంజింగ్ స్టార్ అరెస్ట్ కావడం సినీ ప్రియుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేశాడన్న ఆరోపణలతో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ ఏ1గా ఉంది. అలాగే దర్శన్ ఏ2గా ఉన్నాడు. పవిత్ర ఇంట్లో పని చేస్తున్న కె.పవన్ ఏ3గా ఉన్నారు. వీరితో కలుపుకుని ఈ కేసులో మొత్తం 17 మంది ఉన్నారు. ఇందులో ఇప్పటికి 13 మంది మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నారు.


ఇదిలా ఉంటే తన అభిమాని అయిన రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టైయిన దర్శన్.. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అన్ని ఆధారాలతోనే దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. దీనిపై కొందరు అభిమానులు మండి పడుతున్నారు. అభిమానులకు అండగా, ఆదర్శంగా నిలవాల్సిన ఒక హీరో తన వీరాభిమానినే హత్య చేశాడని తెలియడంతో చిర్రెత్తిపోతున్నారు.

ఈ విషయంలో దర్శన్‌ను క్షమించకూడదని.. అతడికి కచ్చితంగా శిక్ష పడాలని చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇవేం పట్టనట్టుగా తమ హీరో ఏం చేసినా ఓకే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దర్శన్ అరెస్టుపై ఆందోళనలు చేస్తున్నారు. నిరసనలకు దిగుతున్నారు. అంతేకాకుండా దర్శన్ ఉన్న పోలీస్టేషన్ వద్ద గుమిగూడి దర్శన్‌కు సపోర్ట్‌గా నినాదాలు చేస్తున్నారు.


Also Read: రేణుకా స్వామి మర్డర్ కేసు.. పవిత్ర, దర్శన్ స్టేట్‌మెంట్స్ ఇవే..!

దర్శన్‌ను వెంటనే రిలీజ్ చేయాలని రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే దర్శన్ అరెస్టుతో మనస్థాపానికి చెందిన ఓ వీరాభిమాని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెలితే.. రామనగర జిల్లా చన్నపట్నం, మాలెదొడ్డికి చెందిన భైరేష్ హీరో దర్శన్‌కు వీరాభిమాని. అయితే ఇటీవల దర్శన్ అరెస్ట్ అయ్యాడని తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. అదే క్రమంలో రెండు మూడు రోజులు తిండి, నిద్ర లేకుండా ఉన్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే భైరేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి మృతిపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. భైరేష్ కల్వర్టులో పడి చనిపోయాడని కొందరు అంటుంటే.. మరి కొందరు మాత్రం రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అరెస్టు అవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×