E-Paper
Advertisement

Actress Kasthuri Shankar : గంటకు 5 వేలు అని కామెంట్ చేసిన నెటిజెన్ ను దుమ్ము దులిపిన కస్తూరి…

Actress Kasthuri Shankar  : గంటకు 5 వేలు అని కామెంట్ చేసిన నెటిజెన్ ను దుమ్ము దులిపిన కస్తూరి…
Advertisement
Kasthuri Shankar

Actress Kasthuri Shankar : సిల్వర్ స్క్రీన్ ప్రేక్షకుల కంటే కూడా బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి కస్తూరి. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం ,కన్నడ సినిమాలలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటి ఈమె. తెలుగులో పెద్దరికం, భారతీయుడు,అన్నమయ్య చిత్రాలలో నటించిన తర్వాత ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం తెలుగు బుల్లితెర సీరియల్ ప్రేక్షకులకు మాత్రం ఈమె ఇంటింటి గృహలక్ష్మి గా బాగా పరిచయం ఉంది. ఇంటినే కాకుండా సంఘాన్ని కూడా ఉద్ధరించే తులసి పాత్రలో కస్తూరి ప్రతిరోజు బుల్లితెర ప్రేక్షకుల గుండెలు పిండుతూనే ఉంటుంది.

తెలుగులో కస్తూరి నటించిన చిత్రాలు సంఖ్య చాలా తక్కువ.. అయినప్పటికీ ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలకృష్ణ నిప్పురవ్వ , మోహన్ బాబు సోగ్గాడి పెళ్ళాం, రాజశేఖర్ మా ఆయన బంగారం లాంటి చిత్రాలలో కస్తూరి నటించింది.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కస్తూరి ప్రస్తుతం మరొక విషయానికి హాట్ డిస్కషన్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఆమెపై వచ్చిన ఒక కామెంట్ కి కస్తూరి చాలా వైలెంట్ గా రియాక్ట్ అయింది. ఇందులో ఆమె తప్ప ఏమీ లేదు ఆమె ప్లేస్ లో ఎవరున్నా అలాగే సమాధానం చెప్తారు.. ఎందుకంటే చేసిన కామెంట్ అలాంటిది.

Advertisement

 అయితే ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ టీవీ సీరియల్స్ తో షో లతో కస్తూరి తెగ బిజీగా ఉంది. కస్తూరి ఇంతకుముందు తమిళ్ బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంట్ గా వెళ్ళింది అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ప్రస్తుతం రీసెంట్ గా స్టార్ట్ అయిన తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7 లో తమిళ పాపులర్ నటి వనిత విజయ్ కుమార్ కూతురు జోవిక విజయ్ కుమార్ పాల్గొనడం జరిగింది. వనిత విజయ్ కుమార్ తో కలిసి సీజన్ 3 లో కస్తూరి బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోలో జోవిక ఎంట్రీ పై కస్తూరి పలు రకాల ప్రశ్నలు ఎదుర్కొంది. అయితే వీటిపై ఘాటుగా స్పందిస్తూ..”ఒక ఇంట్లో కొంతమందిని పెట్టి.. ఆర్టిఫిషియల్ గా వాళ్ల ఫీలింగ్స్ చూపించే షో ని నేను పట్టించుకోను. నాకు అంత ఓపిక ,ఆసక్తి లేదు నా దగ్గర అంత సమయం కూడా లేదు. నాకున్న కాస్త సమయం నా కుటుంబ బాధ్యతలు ,పనితో సరిపోతాయి.”అంటూ సమాధానం ఇచ్చింది కస్తూరి. అయితే కస్తూరి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో నేటిజెన్లు దీనిపై పలు రకాలుగా స్పందించారు.

Advertisement

కొందరు ఆమెతో ఏకీభవిస్తుంటే మరికొందరు మాత్రం కస్తూరి చెప్పిన మాటలకు నానార్ధాలు తీసి ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే “డబ్బుల కోసం బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన నువ్వు ఇప్పుడు ఇలా ఎలా మాట్లాడుతున్నావు.. మీకు ఎలాగైనా గంటకు 5000 వస్తాయి కదా!”అంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ మాత్రం ప్రస్తుతం ఓ పెద్ద కలకలం రేపింది. ఆ నెటిజన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ కస్తూరి..”మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలాగనా పెంచారు? నీకు అసలు సిగ్గు లేదా?”అంటూ ఫైర్ అయింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×