E-Paper
Advertisement

Keerthy Suresh:- ‘అన్నా తీసేద్దామన్నా’… కీర్తి సురేష్‌పై ‘దసరా’ డైరెక్టర్ కోపం

Keerthy Suresh:- ‘అన్నా తీసేద్దామన్నా’… కీర్తి సురేష్‌పై ‘దసరా’ డైరెక్టర్ కోపం
Advertisement

Keerthy Suresh: ఆమె ఏమో జాతీయ అవార్డు గ్ర‌హీత‌. ఇచ్చిన పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌టం ఆమె నైజం. అత‌నేమో డెబ్యూ డైరెక్ట‌ర్‌. అయితే త‌న సినిమాలో నాయకి ఎలా ఉండాల‌నుకున్నాడో అలాంటి ఓ న‌టిని తీసేయాల‌నుకోవ‌టం పెద్ద సాహ‌స‌మే అవుతుంది. ఇంత‌కీ ఆ డెబ్యూ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు శ్రీకాంత్ ఓదెల‌. ఆ స్టార్ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు.. కీర్తి సురేష్‌. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే, నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం ద‌స‌రా. మార్చి 30న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా అనుకున్న త‌ర్వాత ద‌ర్శకుడు శ్రీకాంత్ ఆమెను క‌లిసి క‌థ‌ను నెరేట్ చేశాడు. త‌ర్వాత ఆమెను త‌న సినిమాలోని వెన్నెల పాత్ర ప‌రంగా 10 నుంచి 12 కిలోలు బ‌రువు పెర‌గ‌మ‌ని చెప్పాడు.

అయితే కీర్తి సురేష్ ద‌ర్శ‌కుడి మాట‌ను ప‌ట్టించుకోలేదు, బ‌రువు పెర‌గ‌లేదు. దీంతో ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల‌కు కోపం వ‌చ్చింది. నేరుగా హీరో నాని ద‌గ్గ‌ర‌కు వెళ్లి ‘అన్నా కీర్తి సురేష్‌ను తీసేద్దామ‌న్నా’ అని అన్నాడు. అది విగానే నాని షాకయ్యాడు. వెంటనే తేరుకుని అక్కడ నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి, నువ్వేమో డెబ్యూ డైరెక్టర్‌వి. అదంతా కుద‌ర‌దని చెప్పేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని నానినే స్వ‌యంగా రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

Advertisement

ఇదే విష‌యంపై కీర్తిసురేష్ స్పందిస్తూ ఒక‌ట్రెండు కిలోలంటే ఓకే అనుకోవ‌చ్చు కానీ.. ప‌ది కిలోల బ‌రువు పెర‌గ‌మంటే ఎలా? ఇప్పుడే బ‌రువు త‌గ్గి స్లిమ్‌గా అయ్యాను. మ‌ళ్లీ వెయిట్ పెర‌గ‌మంటే అందుక‌నే పెరగ‌లేదు అని రియాక్ట్ అయ్యింది. తెలంగాణలోని గోదావ‌రి ఖ‌ని బొగ్గు ప్రాంతం బ్యాక్ డ్రాప్‌లో ద‌స‌రా మూవీ తెర‌కెక్కింది. ఇంత‌కు ముందెన్న‌డూ నాని చేయ‌న‌టువంటి రా లుక్‌లో న‌టించాడు. మరి దసరాతో నాని పాన్ ఇండియా గెలిచి నిలుస్తాడా? అనేది తెలియాలంటే మార్చి 30 వరకు ఆగాల్సిందే.

శాకుంతలం కోసం బంగారు వజ్రాభరణాలు.. రేట్ ఎంతో తెలుసా?

Advertisement

for more updates follow this link:-bigtv

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×