E-Paper
Advertisement

Salaar Trailer : సలార్ ట్రైలర్ లో ఆ మూవీ ఝలక్.. కలిసివస్తుందా లేక కొంప ముంచుతుందా.. 

Salaar Trailer : సలార్ ట్రైలర్ లో ఆ మూవీ ఝలక్.. కలిసివస్తుందా లేక కొంప ముంచుతుందా.. 
Advertisement
Salaar Trailer

Salaar Trailer : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరు క్రేజీ కాంబోలో తెరకెక్కిన సలార్ చిత్రం కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ వాయిదాలు పడుతూ ఎట్టకేలకు డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యం లో మూవీ నుంచి తాజాగా విడుదల చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సన్నివేశాలతో పవర్ ప్యాక్డ్ గా ఉన్న ట్రైలర్ మూవీ పై అంచనాలు భారీగా పెంచుతోంది. డార్లింగ్ ను ఫుల్ యాక్షన్ స్వింగ్లో చూసిన అభిమానులు చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ ట్రైలర్లో ప్రభాస్ కు, అతని ఫ్రెండ్ కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో చూపించడానికి డైరెక్టర్ ఎంతో తాపత్రయపడ్డాడు. ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్లే దేవా క్యారెక్టర్ లో ప్రభాస్ ని ఈ ట్రైలర్ లో ఇంట్రడ్యూస్ చేశారు. మంచి డెప్త్ ఉన్న సన్నివేశాలతో ప్రశాంత్ నీల్ ఈ మూవీ కు కాస్తా ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక ట్రైలర్ ఎండ్ లో ప్రభాస్ ఫైట్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇంతవరకు అంతా బాగానే ఉంది అయితే ట్రైలర్ చూసిన తర్వాత సలార్ కు కేజీఎఫ్ కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement

ఒక చీకటి సామ్రాజ్యం.. దానికి ఒక అధిపతి.. తన తర్వాత కొడుకుని వారసున్ని చేయాలనుకోవడం.. ఆ తండ్రి లేని సమయంలో కొడుకు మీద దాడి ..తన ఎదురుగా వస్తున్న సైన్యాన్ని ఎదుర్కోవడానికి కొడుకు ఎంచుకునే అతని స్నేహితుడు.. స్టోరీలో అక్కడక్కడ వేరియేషన్ ఉన్నప్పటికీ టేకింగ్ చాలా వరకు కేజీఎఫ్ నే పోలి ఉండడం ఈ మూవీపై ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు. సలార్ ట్రైలర్ ని క్యాజువల్ గా చూసిన ఎవరికైనా సరే.. నెరేషన్ నుంచి విజువల్స్ వరకు ..క్యారెక్టర్స్ నుంచి కాన్సెప్ట్ వరకు ఎంతో కొంత కేజీఎఫ్ చాయలు కనిపిస్తాయి. ప్రస్తుతానికి ట్రైలర్ కి మంచి పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ.. కేజీఎఫ్ ఛాయలు సలార్ మూవీకి కలిసొస్తాయా లేక వికటిస్తాయా ఇప్పుడే చెప్పలేము.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×