E-Paper
Advertisement

KA Movie Sequel: సీక్వెల్ పై బిగ్ అప్డేట్..త్వరలో అనౌన్స్మెంట్..!

KA Movie Sequel: సీక్వెల్ పై బిగ్ అప్డేట్..త్వరలో అనౌన్స్మెంట్..!
Advertisement

KA Movie Sequel: ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ (KA Movie) సినిమా మొదట యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ రోజు రోజుకి కథ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంతో భారీ సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. మంచి సక్సెస్ కోసం ఎదురుచూసిన కిరణ్ అబ్బవరం అసలైన సక్సెస్ రుచి ఎలా ఉంటుందో చాలా కాలం తర్వాత చూస్తున్నారు అని చెప్పవచ్చు. కిరణ్ అబ్బవరం హిట్ కొట్టడంతో సోషల్ మీడియా మొత్తం ఆనందం వ్యక్తం చేస్తూ.. ఈ సినిమా పోస్టర్స్ ను అటు సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ అయిన ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్ లలో తెగ ట్రెండ్ చేసేస్తున్నారు.

ఛాలెంజ్ విసిరిన హీరో..

Advertisement

సినిమా పైన కిరణ్ పెట్టుకున్న నమ్మకమే నిజమైంది. అందుకే ఎక్కడ చూసినా జనాలు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే “ఈ సినిమా ఎక్కడో చూసినట్టుంది..పాత కథే కదా అని ఎవరైనా అంటే కచ్చితంగా సినిమాలు మానేస్తానని” కిరణ్ అబ్బవరం చాలా కాన్ఫిడెన్స్ గా ఛాలెంజ్ విసిరాడు. అయితే అప్పుడు అర్థం కాలేదు. కానీ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థం అయింది. చాలామంది సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా క్లైమాక్స్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు.

సీక్వెల్ పై బిగ్ అప్డేట్..

Advertisement

మొత్తానికైతే ఈ సినిమాతో హిట్ అందుకున్నారు కిరణ్ అబ్బవరం. ఇకపోతే తాజాగా ఈ సినిమా కి సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా.. అందులో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సీక్వెల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. “మా డైరెక్టర్ గారి దగ్గర సీక్వెల్ పై మంచి ఐడియా ఉంది. త్వరలోనే అంటే మరో వారంలో సీక్వెల్ పై అనౌన్స్మెంట్ ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఊహించని విధంగా ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాము” అంటూ క సినిమా సీక్వెల్ పై కామెంట్ చేశాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నారు.

‘క ‘అంటే..?

ఇదిలా ఉండగా ఈ సీక్వెల్ గురించి చెప్పేముందు అసలు ‘క’ అంటే ఏంటో కూడా అర్థం చెప్పాలి. ‘క ‘అంటే అంతరాత్మ అని, సినిమా పతాక సన్నివేశాలలో హీరో కిరణ్ అబ్బవరం పాత్రతో క్లారిటీ కూడా ఇచ్చారు. మరి ఈ సినిమాలో అంతరాత్మ ప్రాముఖ్యత ఏమిటి? అసలు అంతరాత్మ ఏం చేసింది? అనే విషయాలను కూడా సినిమాలో చక్కగా చూపించారు. అంతేకాదు థియేటర్లలో ఎండ్ కార్డ్స్ పడే ముందు కూడా రెండో పార్ట్ గురించి తెలిపారు. మొదటి పార్ట్ లో అంతరాత్మ ఆడియన్స్ అందర్నీ కూడా ఎంటర్టైన్ చేసింది. మరి రెండవ భాగంలో ఆ అంతరాత్మ ఏం చేస్తుందో చూడాలి అని ఆడియన్స్ మొత్తం ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు త్వరలోనే సీక్వెల్ షూటింగ్ మొదలుపెట్టే ప్రయత్నాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. సుజిత్, సందీప్ కలిసి తెరకెక్కించిన ఈ సినిమాలో తన్వి రామ్, నయన్ సారిక హీరోయిన్ లుగా నటించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×