E-Paper
Advertisement

Dhanush Wayanad Landslide: వయనాడ్ బాధితులకు ధనుష్ సాయం.. లక్షల్లో విరాళం..

Dhanush Wayanad Landslide: వయనాడ్ బాధితులకు ధనుష్ సాయం.. లక్షల్లో విరాళం..
Advertisement

Wayanad Landslide: కేరళ రాష్ట్రం వయనాడ్‌లో వరదలు బీభత్స సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. దాదాపు వందల సంఖ్యలో మరణించారు. మరెందరో శిథిలాల కింద సజీవ దహనం అయ్యారు. ఇంకెందరో నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ప్రజలు ఆ ఊహించని విపత్తు నుంచి కోలుకోలేదు. దీంతో ప్రముఖ సినీ సెలబ్రిటీలు వయనాడ్ ప్రజలకు ఆర్థికంగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఇప్పటికి చాలా మంది నటీ నటులు అక్కడి ప్రజలు భారీగా విరాళాలు అందించారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి మరొక హీరో వచ్చి చేరాడు. అతడెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. తాజాగా ఈ హీరో తన వంతు సాయంగా వయనాడ్ ప్రజలకు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో భారీ వర్షాల కారణంగా వరదలతో అతలాకుతలం అయిన వయనాడ్ జిల్లా ప్రజలకు తమ వంతు సాయం చేస్తామని ముందుకు వస్తున్న సినీ సెలబ్రిటీలను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: వయనాడ్ కోసం చేతులు కలిపిన సీనియర్ బ్యూటీస్..

అయితే ధనుష్ ఎంతమేర విరాళం అందించాడో అనే విషయానికొస్తే.. వయనాడ్ ప్రజలకు ధనుష్ రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ ప్రకృతి విపత్తులో ఎంతో మంది నిరాశ్రయులవ్వడం తనను కలచివేసిందని తెలిపాడు. కాగా ఇప్పటి వరకు కోలీవుడ్ నుంచి సూర్య, కార్తీ, జ్యోతికలు కలిసి రూ.50 లక్షలు ప్రకటించారు. అలాగే చియాన్ విక్రమ్ రూ.20 లక్షలు విరాళంగా అందించాడు.

Advertisement

నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ రూ.20 లక్షలు ప్రకటించారు. అలాగే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి అండ్ రామ్ చరణ్ కలిసి రూ.1 కోటి ఆర్థిక సాయం చేశారు. అల్లు అర్జున్ రూ.25 లక్షలు అందించాడు. మాలీవుడ్‌ నుంచి కూడా సాయం అందింది. మోహన్ లాల్ రూ.3 కోట్లు ప్రకటించాడు. దీంతో పాటు ఒక స్కూల్ నిర్మాణానికి పూర్తి బాధ్యతలు తీసుకున్నాడు. వీరితో పాటు రష్మిక కూడా తన వంతు సాయంగా రూ.10 లక్షలు అందించింది. ఇలా ఎవరికి తోచిన సాయం వారు చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×