E-Paper
Advertisement

rajinikanth – lal salaam trailer: రజినీకాంత్ ‘లాల్ సలాం’ ట్రైలర్ విడుదల.. అదిరిపోయిందంతే..

rajinikanth – lal salaam trailer: రజినీకాంత్ ‘లాల్ సలాం’ ట్రైలర్ విడుదల.. అదిరిపోయిందంతే..
Advertisement

rajinikanth – lal salaam trailer: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమర్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయన మొయిద్దీన్ భాయ్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఇందులో ఆమె రజనీకి సోదరిగా నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారు. మతం, రాజకీయం, స్పోర్ట్స్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు.

Advertisement

అయితే ఈ మూవీలో రెహమాన్ ఓ అద్భుతం చేయబోతున్నట్లు తెలుస్తోంది. దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్ హమీద్‌ల గాత్రాన్ని కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికత ద్వారా రీ క్రియేట్ చేసి ‘తిమిరి ఎళుడా’ అనే సాంగ్‌‌ చేయబోతున్నారు.

ఇక ‘జైలర్’ మూవీ తర్వాత రజనీ కాంత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘లాల్ సలాం’ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Advertisement

ఇందులో రజనీ కాంత్ రోల్ చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్స్ ద్వారా మంచి అంచానాలు ఏర్పరచుకున్న ఈ మూవీ తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో అంచనాలను రెట్టింపు చేసుకుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×