E-Paper
Advertisement

Krishna Vamsi: ఆయన మరణం.. కోలుకోవడానికి మూడు రోజులు పట్టింది

Krishna Vamsi: ఆయన మరణం.. కోలుకోవడానికి మూడు రోజులు పట్టింది
Advertisement

Krishna Vamsi: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు తెలుగు ఇల్లు, తెలుగు పద్ధతులు, కుటుంబాలు ఎలా ఉంటాయి అనేది కృష్ణవంశీ సినిమాలు చూసి తెలుసుకోవచ్చు. ఒకప్పుడు హిట్ సినిమాలను తెరకెక్కించిన కృష్ణవంశీ ఈ మధ్య కొద్దిగా వెనక్కి తగ్గాడు.

గతేడాది రంగమార్తాండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృష్ణవంశీ ప్రస్తుతం మంచి కథను రాసే పనిలో ఉన్నాడు. ఇక ఈ మధ్యకాలంలో ఆయన సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. అభిమానులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో ఓపిగ్గా సమాధానాలు చెప్తూ అలరిస్తున్నాడు. అయితే తాజాగా కృష్ణవంశీ.. నా ఉచ్ఛ్వాసం కవనం అనే షోలో అతిధిగా విచ్చేసాడు.

Advertisement

దివంగత లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాత్రమే మాట్లాడుకొనే ప్రోగ్రామ్ అది. ఆయనతో ఉన్న అనుబంధాలను పంచుకోవడానికి ఎంతోమంది నటీనటులు, డైరెక్టర్స్ ఈ ప్రోగ్రాం కు విచ్చేశారు. ఈసారి కృష్ణవంశీ పాల్గొని ఆయనతో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టారు. వీరి కాంబోలో ఎన్నో మంచి సాంగ్స్ వచ్చాయి.

సాంగ్స్ విషయంలో మీ మధ్య ఎప్పుడైనా విభేదాలు వచ్చాయా.. ? అంటే.. అలాంటివేమీ లేవని,ఆయన చిరాకుగా ఉన్నా కూడా కోప్పడరని తెలిపాడు. ఇక కృష్ణవంశీ.. సిరివెన్నెల మృతి చెందినప్పుడు చివరి చూపు చూడడానికి కూడా రాలేదు. ఆ విషయం గురించి మాట్లాడుతూ కృష్ణవంశీ ఎమోషనల్ అయ్యాడు.

Advertisement

” సిరివెన్నెల గారి మరణవార్త విని నేను షాక్ అయ్యాను. దాన్ని నుంచి కోలుకోవడానికి మూడురోజులు పట్టింది. మూడు రోజుల తరువాత ఆ షాక్ నుంచి బయటపడ్డాను. ఆయనను అలా చూడలేకపోయాను.. అందుకే రాలేదు. ఆయనతో నా స్నేహం జన్మ ధన్యం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×