BigTV English

Prabhas: ప్రభాస్ ముందు అల్లు అర్జున్ పిల్లాడు.. బాలీవుడ్ క్రిటిక్ సంచలన వ్యాఖ్యలు

Prabhas: ప్రభాస్ ముందు అల్లు అర్జున్ పిల్లాడు.. బాలీవుడ్ క్రిటిక్ సంచలన వ్యాఖ్యలు

Prabhas: బాలీవుడ్ క్రిటిక్ KRK గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాలానే కాదు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను కూడాపూచిక పుల్లతో తీసిపడేస్తాడు. ఎవరు ఏమనుకుంటారు.. ఏం చేస్తారు.. ? అనే భయం కూడా లేకుండా నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో బాలీవుడ్ ను ఏకిపారేస్తాడు. తాజాగా ఈ క్రిటిక్.. ప్రభాస్, అల్లు అర్జున్ గురించి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియో ఎప్పటిదో.. ఏ సందర్భంలో మాట్లాడారో తెలియదు.. కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.


ఇక ఈ వీడియోలో KRK.. ప్రభాస్ ను అల్లు అర్జున్ తో పోల్చొద్దు అని చెప్తున్నాడు. బాలీవడ్ లో ప్రభాస్ హిట్ అయినా అవ్వకపోయినా అతడి స్థానం వేరు అని, అతను అందగాడు అని తెలిపాడు. “నేను అల్లుఅర్జున్, అతని నటన గురించి మాట్లాడినట్లయితే.. ముందుగా అల్లు అర్జున్ మరియు ప్రభాస్ మధ్య పోలిక లేదని నేను స్పష్టం చేస్తాను. ప్రభాస్ సినిమా విజయం సాధించినా, సాధించకపోయినా, అతను అద్భుతమైన ఫిజిక్‌తో చాలా ఆకట్టుకునే, అందమైన హీరో. అతనితో పోలిస్తే చిన్నపిల్లడిలా కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ ఫిజిక్ లో కానీ, హిట్ లో కానీ కొంచెం తక్కువ ఉంటాడు.

ఇండియన్స్ కు తక్కువ హైట్ ఉన్న హీరోలే నచ్చుతారు. కానీ, బాలీవుడ్ లో అలాంటివారును ఎంకరేజ్ చేయరు.. ఎవరు చూడరు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సెన్సేషన్ గా మారింది. ఇక ఈ వీడియో కింద అభిమానులు.. ప్రభాస్ ముందు అల్లు అర్జున్ పనికిరాడు అని చెప్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు త్వరలోనే పుష్ప 2 తో బన్నీ బాలీవుడ్ లో తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు. మరి KRK మాటలు నిజమవుతాయా.. ? లేదా..? అనేది చూడాలి.


https://twitter.com/RohitYadav_69/status/1778637627027333481

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×