BigTV English

Liam Payne: కాబోయే భార్యతో విభేదాలు… భవనంపై నుంచి దూకి ఫేమస్ సింగర్ సూసైడ్..

Liam Payne: కాబోయే భార్యతో విభేదాలు… భవనంపై నుంచి దూకి ఫేమస్ సింగర్ సూసైడ్..

Liam Payne : సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, గుర్తింపు కోసం ఎన్నో ఇబ్బందులు పడి, ఆ గుర్తింపు వచ్చిన తర్వాత అనూహ్యంగా మరణించడం అందరినీ కలిచి వేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్, సిల్క్ స్మిత ఇలా ఎంతోమంది సక్సెస్ కోసం ఆరాటపడి , ఆ సక్సెస్ వచ్చిన తర్వాత పబ్లిక్ ఫిగర్ గా మారి ఆత్మహత్యలు చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో హాలీవుడ్ సింగర్ చేరిపోయారని చెప్పాలి. తాజాగా ఆయన మూడవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఒక వార్త సంచలనం సృష్టించింది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


భవనం మీద నుండి దూకి మరణం..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. లియామ్ పేన్ , మాజీ వన్ డైరెక్షన్ సింగర్ లియామ్ పేన్ 31 ఏళ్ల వయసులో మరణించాడు. బుధవారం రోజు అర్జెంటీనాలోని ఒక హోటల్ భవనం నుండి ఆయన మరణించినట్లు అక్కడి పోలీసులు స్పష్టం చేశారు. మూడవ భవనం నుండి కింద పడినప్పుడు శబ్దం రావడం అది తాను విన్నానని హోటల్ మేనేజర్ కూడా వెల్లడించారు. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. ఇక ఆయన మరణించినట్లు నిర్ధారణకు వచ్చిన తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ ముందు వెల్లడించినట్లు సమాచారం.


కాబోయే భార్యతో విభేదాలే కారణమా..?

అయితే ఈయన మరణానికి ముందు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి మాయా హెన్రీ (23) తో గొడవలు పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎంత గొడవలు పడినా లియామ్ మరణం విని ఆమె షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈయన మరణానికి ముందు హెన్రీ తో చట్టపరమైన వివాదాలలో చిక్కుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే వన్ డైరెక్షన్ సింగర్ లియామ్ పేన్ ఆమెకు ప్రపోజ్ చేసిన కొన్నాళ్లకు నిశ్చితార్థం కూడా చేసుకున్నారట. అయితే రెండేళ్లకు అనగా 2022లో హెన్రీ పెయిన్ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈయనపై ఆమె అవిశ్వాస ఆరోపణలు చేయడం వల్లే వారి నిశ్చితార్థం కూడా ముగిసినట్లు సమాచారం.

చిత్రవధ చేశాడు – హెన్రీ

ఇకపోతే అక్టోబర్ 16 వ తేదీన ఆయన మరణించగా.. ఇంతకుముందు అన్ని చట్టపరమైన సమస్యలలో మునిగిపోయాడని, సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు అతడిపై చట్టపరమైన చర్యలు లియామ్ పేన్ పై తీసుకోవాలనుకున్నప్పుడు పేన్ ఆమెను నాన్ స్టాప్ గా సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పేన్ తనపై విచక్షణారహితంగా ప్రవర్తించాడు అంటూ ఆయన భార్య వెల్లడించింది. మేము విడిపోయిన తర్వాత కూడా వరుస మెసేజ్లతో నన్ను చిత్రవధకు గురి చేశాడు. నన్ను సంప్రదించడానికి వరుసగా ఫోన్ కాల్స్ చేసేవాడు. దాంతో నేను ఫోన్ నెంబర్లు కూడా మార్చాను. ఆఖరికి మా అమ్మ ఫోన్ ని కూడా పగలగొట్టాడు అంటూ హెన్రీ చెప్పుకొచ్చింది..

డ్రగ్స్ కి బానిసయ్యారా..?

ఇకపోతే లియాన్ పేన్ గతంలో డ్రగ్స్ కి బానిసైనట్లు సమాచారం. ఇప్పుడు హెన్రీ నుంచి విడిపోయిన తర్వాత అవే ఆయనను మళ్ళీ చుట్టుముట్టాయని , ఆ మత్తులోనే ఆయన మూడవ భవనం నుంచి కింద పడ్డాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒక హాలీవుడ్ సింగర్ ఇప్పుడు మరణించడం సంచలనం సృష్టిస్తోంది. ఇక లియాన్ పేన్ విషయానికి వస్తే 2020 ఫిబ్రవరి 17న లారస్ వరల్డ్ స్పోర్ట్స్ 2020 అవార్డ్స్ వేడుకకు ముందు రెడ్ కార్పెట్ పై ఫోజులిచ్చారు. అర్జెంటీనాలో ఒక హోటల్ అంతస్తు బ్యూనస్ ఎయిర్స్ లోని భవనం నుండి మరణించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×