E-Paper
Advertisement

Vettaiyan The Hunter: తెలుగులో వెట్టయన్ బ్యాన్.. స్పందించిన లైకా

Vettaiyan The Hunter: తెలుగులో వెట్టయన్ బ్యాన్.. స్పందించిన లైకా
Advertisement

Vettaiyan The Hunter: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వెట్టయన్. టీజీ  జ్ఞానవేల్  దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలోఅమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, GM సుందర్, అభిరామి, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్, రక్షణ లాంటి స్టార్స్  నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అక్టోబర్ 10 అనగా రేపే ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు రానుంది.

రజినీ సినిమా అంటే.. తెలుగు ప్రేక్షకులు కూడా ఏ రేంజ్ లో ఎదురుచూస్తారో ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి మాత్రం తెలుగు ప్రేక్షకులు.. వెట్టయన్ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏకంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని  డిమాండ్ చేస్తున్నారు. అందుకు కారణం మేకర్స్ కు.. తెలుగువారిపై గౌరవం లేదని, సినిమాకు తెలుగు టైటిల్ కాకుండా తమిళ్ టైటిల్ నే పెట్టారని చెప్పుకొస్తున్నారు.  

Advertisement

తెలుగు సినిమాలు.. ఇతర భాషల్లో విడుదలయితే ఆ భాషకు తగినట్టుగా టైటిల్స్‌ను మారుస్తున్నారు తెలుగు మేకర్స్. కానీ కోలీవుడ్ మేకర్స్‌లో అలాంటి ఆలోచనే రావడం లేదు. అసలు నోరు తిరగని తమిళ పదాలను తీసుకొచ్చి తెలుగులో టైటిల్స్‌గా పెట్టడం అస్సలు కరెక్ట్ కాదని చెప్పుకొస్తున్నారు. అందుకే తెలుగువారు ఈ సినిమాను చూడకూడదని, తెలుగులో ఈ సినిమాను బ్యాన్ చేయాలనీ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

ఇక ఈ ట్రెండ్.. లైకా మీడియా వరకు  వెళ్లడంతో వారు స్పందించారు. తాము కావాలని ఈ తప్పు చేయలేదని తెలుపుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు. మొదట ఈ సినిమాకు తెలుగులో వేటగాడు అనే టైటిల్ నే అనుకున్నామని, అయితే అప్పటికే తెలుగులో ఈ టైటిల్ ఉన్నా కూడా  రిజిస్టర్ చేద్దామనుకొనే లోపే మరో నిర్మాత రిజిస్టర్ చేయడంతో అది అందుబాటులోకి రాలేదని, అందుకే టైటిల్ ను విరమించుకున్నట్లు తెలిపారు. దీంతోవెట్టయన్ కు ది హంటర్ యాడ్ చేశామని, తెలుగులో ది హంటర్  అనేది  అర్థమవుతుందని చెప్పారు.

Advertisement

ఇక దీంతో పాటు ఈ కథకు ఆ తెలుగు టైటిల్ ఎంతో యాప్ట్ అవుతుందని, అందుకే దాన్ని మార్చలేదని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలు తమ తిరుగులేని మద్దతు, సహకారం  అందించవలసిందిగా  అభ్యర్ధించారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి లైకా ఇచ్చిన వివరణతో తెలుగు ఫ్యాన్స్ కూల్ అవుతారో.. లేదో తెలియాల్సి ఉంది. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×