E-Paper
Advertisement

Ma Nanna Super Hero : ప్రమోషన్స్ మామూలుగా లేవు, క్రేజి థాట్ అసలు

Ma Nanna Super Hero : ప్రమోషన్స్ మామూలుగా లేవు, క్రేజి థాట్ అసలు
Advertisement

Ma Nanna Super Hero : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో సుధీర్ బాబు ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపిస్తూ తనకంటూ సొంత గుర్తింపు సాధించుకున్నారు. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన ఏమాయ చేసావే సినిమాలో సమంతకు అన్న పాత్రలో కనిపించాడు సుధీర్. ఇక తర్వాత ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో సుధీర్ తో పాటు రెజీనా హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ను సాధించలేకపోయింది. కానీ ఈ సినిమా సుధీర్ బాబుకి మంచి పేరు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో సుధీర్ చేసిన డాన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత వరుసగా సుధీర్ బాబు సినిమాలు చేసినా కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవలేకపోయాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహనం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా సుధీర్ బాబుకి పడిన ఫస్ట్ హిట్ అని చెప్పాలి. ఈ సినిమాలో సుధీర్ బాబు ఇన్నోసెన్స్, అలానే నరేష్ కామెడీ, ముఖ్యంగా వివేక్ అందించిన మ్యూజిక్ ఇవన్నీ కూడా మంచి ప్లస్ గా మారి సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వి వంటి సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు ఊహించిన స్థాయిలో ఆటలేదు. లేకపోతే నటులు రచయిత దర్శకత్వం వహించిన హర్షవర్ధన్ మామ మచ్చింద్ర సినిమా కూడా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఇక రీసెంట్ గా హరోం హరా సినిమాతో తెలుగు ప్రాక్షకులు ముందుకు వచ్చాడు సుధీర్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సుధీర్ బాబుకి మంచి పేరు తీసుకొచ్చింది. జ్ఞాన సాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలామంది ఆడియన్స్ కి సర్ప్రైజ్ గా అనిపించింది కొంతమంది ఇదే సినిమాను విక్రమ్ వంటి సినిమాలు తో కూడా పోల్చారు. ఈ సినిమాతోనే సుధీర్ బాబు కి నవ దళపతి అని టాగ్ కూడా వచ్చింది.

Advertisement

ఇక ప్రస్తుతం సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఫాదర్ అండ్ సన్ మధ్య రిలేషన్ చాలా న్యాచురల్ గా చూపించారు. ఫాదర్ సెంటిమెంట్ సినిమాలుకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమాకి జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. టీజర్ కి కూడా మ్యూజిక్ మంచి ప్లస్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలకు ఆడియన్స్ మంచి రిజల్ట్ అందించారు. ఇక సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమా కూడా మంచి హిట్ అయింది. సుధీర్ నటిస్తున్న మా నాన్న సూపర్ హీరో సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి అని చెప్పాలి.

మామూలుగా ఒక మంచి సినిమాను చేయటం వేరు, ఆ మంచి సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడం వేరు. ఈ సినిమాకి సంబంధించి చాలా క్రేజీ ప్రమోషన్స్ చేస్తున్నారు అని చెప్పాలి. ఈ సినిమా బ్యానర్ ని ఒకటి రెడీ చేసి. చాలామంది సెలబ్రిటీస్ ఫొటోస్ ను తీసుకుంటున్న తరుణంలో వెనక ఈ సినిమా పోస్టర్ కనిపించేలా ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ చాలా న్యాచురల్ గా వర్క్ అవుట్ అవుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ ట్విట్టర్లో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో అంచనాలను అందుకుంటుంది అని చాలామంది ఊహిస్తున్నారు. ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో తెలియాలి అంటే రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×