E-Paper
Advertisement

Madhusudan Rao: కొడుకు చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న ‘నా సామిరంగ’ విలన్..!

Madhusudan Rao: కొడుకు చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న ‘నా సామిరంగ’ విలన్..!
Advertisement

Madhusudan Rao: ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు మధుసూధన్ రావు. తాజాగా ఈ నటుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆయనను విలన్‌గా ఓ డైరెక్టర్ గుర్తించినట్లు తెలిపాడు. అయితే ఓ సినిమాలో తన నటన చూసి చాలామంది బాగా చేశావ్ అన్నారే కానీ.. ఏ ఒక్కరు కూడా అవకాశాలు ఇవ్వలేదని తెలిపాడు. అంతేగాక ఆయన కుమారుడు తనకు తెలియకుండానే ఓ సినిమా చేసి షాక్ ఇచ్చాడని వెల్లడించాడు. ఇంతకీ ఆయన్ను విలన్‌గా గుర్తించిన డైరెక్టర్ ఎవరు?.. ఆయన కుమారుడు తీసిన సినిమా పేరేంటి? అనే విషయానికొస్తే..

కింగ్ నాగార్జున హీరోగా ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో విలన్‌గా నటించిన మధుసూధన్ రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. తనను విలన్‌గా గుర్తించిన డైరెక్టర్ దేవ కట్టా అని అన్నాడు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆటోనగర్ సూర్య’ సినిమా తర్వాత తన దశ మారిపోయిందని తెలిపాడు. అయితే ఆ మూవీలో తన నటన చాలా అద్భుతంగా ఉందని చెప్పారే తప్ప.. ఎవరూ అవకాశాలు ఇవ్వలేదని అన్నాడు.

Advertisement

అయితే ఈ నటుడికి ఇద్దరు కుమారులు. అందులో ఒక కుమారుడు ప్రీతం.. తనకు తెలియకుండానే సినిమా చేశాడని అన్నాడు. ఆ సినిమా పేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అని తెలిపాడు. ఇక సినిమా మొత్తం పూర్తయిన తర్వాతనే తనకి చెప్పాడని.. దీంతో ఒక్కసారిగా తాను షాక్ అయ్యానని తెలిపాడు. తన కళ్ళముందే ఎదుగుతున్న కుమారుడు ప్రీతంను చూసి ఆనందం పట్టలేక ఏడ్చేశానని చెప్పుకొచ్చాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×