E-Paper
Advertisement

Mahendragiri Vaarahi: సంక్రాంతి బరిలోకి సుమంత్ మూవీ.. అందరిని పిచ్చోళ్లను చేసేలా నిర్మాత మాస్టర్ ప్లాన్…?

Mahendragiri Vaarahi: సంక్రాంతి బరిలోకి సుమంత్ మూవీ.. అందరిని పిచ్చోళ్లను చేసేలా నిర్మాత మాస్టర్ ప్లాన్…?

Mahendragiri Vaarahi: సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది సంక్రాంతి పండగకు కొత్త సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా 7 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలను చేస్తున్న స్టార్ హీరోల సినిమాలు తమ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నాయి.. ఇక తాజాగా మరో చిన్న సినిమా ఈ పోటీలో దిగేందుకు రెడీ అవుతుంది. ఆ సినిమానే ‘మహేంద్రగిరి వారాహి’.. హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చెయ్యడం వెనుక పెద్ద కుట్ర ఉందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అసలు మ్యాటర్ ఏంటో కాస్త వివరంగా తెలుసుకుందాం..

‘మహేంద్రగిరి వారాహి’ మూవీ స్టోరీ…

టాలీవుడ్ హీరో సుమంత్ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. అప్పుడప్పుడు ఒక సినిమాతో ఇలా వచ్చి అలా మాయం అవుతాడు. అందుకే ఆయన చేసిన ఎక్కువే ఉన్నా హిట్ మూవీలు తక్కువగానే ఉన్నాయి.. 2021 లో మ‌ళ్లీ మొద‌లైంది సినిమాలో క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా 2022లో ధ‌నుష్‌ సార్‌, దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించి మెప్పించాడు. కాస్త విరామం తీసుకొని ఇప్పుడు హీరోగా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహేంద్రగిరి వారాహి సినిమాలో నటిస్తున్నాడు. రాజశ్యామల బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెంబరు 2గా తెరకెక్కుతున్న ఈ చిత్ర గ్లిమ్స్ ను ఇటీవల విడుదల చేశారు.. ఆ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశం ఆధారంగా ఈ మూవీ ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమా ఉండబోతుందని ఈ మూవీ అప్డేట్స్ చూస్తే అర్థమవుతుంది.

సంక్రాంతి బరిలోకి ‘మహేంద్రగిరి వారాహి’.. ఇంత పెద్ద స్కెచ్ ఉందా…?

ప్రతి యేటా సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాగే ఈ సంక్రాంతికి కూడా బాలయ్య, రామ్ చరణ్ తో పాటు వెంకీ మూవీలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా 7 సినిమాలు తమ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నాయి.. ఇలాంటి పెద్ద సినిమాలు వస్తున్న టైంలో సుమంత్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది.. అయితే ఈ డేట్ ను అనౌన్స్ చెయ్యడం వెనుక నిర్మాత మాస్టర్ ప్లాన్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. డేట్ ను అయితే అనౌన్స్ చేశారు. కానీ రిలీజ్ చెయ్యడం లేదట.. అదేంటి అనుకుంటున్నారా? అక్కడే ఓ మెలిక ఉంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు, భారీ యాక్షన్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామని ప్రకటిస్తే ఈ సినిమాలో ఏదో విషయం ఉంది. అందుకే ఇంత ధీమాగా ఉన్నారని జనాలు ఆసక్తి కనబరుస్తున్నారని మేకర్స్ ప్లాన్ చేశారట.. అలా మూవీ పై ఒక బజ్ ను క్రియేట్ చేసి వదిలేస్తే జనాలు మూవీ గురించి ఆలోచిస్తారని ప్లాన్ అట.. ఆ తర్వాత ఎప్పటిలాగే ఈ మూవీని సంక్రాంతి బరి నుంచి తప్పించి, ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అలాగే లాస్ట్ సంక్రాంతి టైంలో పోటీని తగ్గించడానికి ఫిల్మీ ఛాంబర్ రంగంలోకి దిగి కొన్ని సినిమాలకు సోలో రిలీజ్ ఆప్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ మహేంద్రగిరి వారాహికి కూడా అలాంటి సోలో రిలీజ్ ఆప్షన్ రావొచ్చు అని కూడా నిర్మాతలు ఆలోచిస్తున్నారని టాక్.. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరిని పిచ్చోళ్లను చేసేలా ప్లాన్ చేస్తున్నారా నిర్మాతలు అంటూ అప్పుడే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ డేట్ హాట్ టాపిక్ అవుతుంది. ఇక ఈ వార్తల పై నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో? నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నట్లు సినిమాను సైలెంట్ గా తప్పిస్తారా? లేదా పరువు పోతుందని రిలీజ్ చేస్తారా? అనేది తెలియాలంటే ఈ చిత్ర నిర్మాతలు రియాక్ట్ అయ్యేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×