E-Paper
Advertisement

Mahesh movie update : మ‌రింత వెన‌క్కి SSMB 28… నిర్మాతల మల్లగుల్లాలు

Mahesh movie update : మ‌రింత వెన‌క్కి SSMB 28… నిర్మాతల మల్లగుల్లాలు

Mahesh movie update : సూపర్‌స్టార్ మ‌హేష్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. SSMB 28 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ వ‌చ్చే నెల మొద‌టి వారంలో ప్రారంభం కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. అదేంటంటే సినిమా రిలీజ్ డేట్ మ‌రింత వెన‌క్కి వెళుతుంద‌ని. సినిమా అనౌన్స్‌మెంట్ రోజునే సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుంద‌ని మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. అనుకున్న ప్లానింగ్‌తో షూటింగ్ జ‌రిగి ఉండుంటే అలాగే చేసి ఉండేవారేమో. కానీ మ‌హేష్ అమ్మ‌గారు, నాన్న కృష్ణ చ‌నిపోయారు. దీంతో షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఈ ఆలస్యం సినిమా రిలీజ్ డేట్‌పై ప్ర‌భావం చూప‌నుంద‌ని స‌మాచారం. రీసెంట్ టైమ్‌లో SSMB 28 రిలీజ్ డేట్‌ను ఆగ‌స్ట్ 9కి మార్చార‌నే వార్త‌లు గ‌ట్టిగానే వినిపించాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఇప్పుడు SSMB 28 రిలీజ్ డేట్ మ‌రింత ఆల‌స్యం కానుంద‌ని టాక్‌. సినీ స‌ర్కిల్స్‌లో న్యూస్ మేర‌కు ఇప్పుడు SSMB 28 రిలీజ్ డేట్ మ‌రింత వెన‌క్కి వెళ్లింద‌ని వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌ర్ 11న రిలీజ్ కానుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ఇది.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×