E-Paper
Advertisement

DoubleISMART: మాకి కిరికిరి.. పెంచు..పెంచు.. హైప్ ఇంకా పెంచు

DoubleISMART: మాకి కిరికిరి.. పెంచు..పెంచు.. హైప్ ఇంకా పెంచు
Advertisement

DoubleISMART: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఆరాటపడుతున్నాడు. గతేడాది నుంచి రామ్ కు ఒక్క హిట్ కూడా పడలేదు. ఇక ఈసారి ఎలాగైనా గట్టిగా హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నాడు. అందులో భాగంగానే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ పైనే ఆశలు పెట్టుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ మరియు ఛార్మీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు. అయితే గత కొన్ని రోజులుగా డబుల్ ఇస్మార్ట్ నుంచి అప్డేట్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

రామ్ బర్త్ డే మే 15 కావడంతో ఆరోజు సినిమా రిలీజ్ డేట్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇక మే 15 కు నాలుగు రోజులే ఉండడంతో మేకర్స్ సోషల్ మీడియాలో హైప్ పెంచడానికి సిద్ధమయ్యారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోని రామ్ ఐకానిక్ డైలాగ్స్ ను మరోసారి డబుల్ ఇస్మార్ట్ ను ట్యాగ్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. మాకి కిరికిరి.. ఏదోవచ్చేలా ఉంది.

దిమాక్కి కిరికిరి పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు నెట్టింట వైరల్ గా మారాయి. నిజం చెప్పాలంటే.. ఈ సినిమాపైనే అటు పూరి.. ఇటు రామ్ ఆశలు పెట్టుకున్నారు. లైగర్ లాంటి భారీ పరాజయం తరువాత పూరి మళ్లీ డబుల్ ఇస్మార్ట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. మరి అది అవుతుందో లేదో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×