E-Paper
Advertisement

Mallika Sherawat: ఆ హీరో అర్ధరాత్రి తలుపు కొట్టడంతో.. ఆ క్షణమే పోయాననిపించింది..!

Mallika Sherawat: ఆ హీరో అర్ధరాత్రి తలుపు కొట్టడంతో.. ఆ క్షణమే పోయాననిపించింది..!
Advertisement

Mallika Sherawat.. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఏ ఫిలిం ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు ఎంతోమంది ఇప్పటికీ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఆడవారు.. ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన ఇబ్బందుల గురించి చెప్పుకుంటున్నారు.ఈ క్రమంలోనే లైంగిక వేధింపుల కేసులో తానేమి ప్రత్యేకం కాదంటూ.. తాను కూడా ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను అంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ (Mallika Sherawat).

ఆ టార్చర్ భరించలేనిది..

Advertisement

హిందీ పరిశ్రమ లో ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె.. తాజాగా విక్కీ విద్యా కా వో వాలా వీడియో ను ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తనకు జరిగిన ఒక చేదు భయానక అనుభవాన్ని అందరితో పంచుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు ఒక మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ షూటింగ్లో ఉన్నప్పుడు ఒక ప్రముఖ నటుడు తనను మానసికంగా చిత్రవధకు గురి చేశాడని ప్రముఖ హీరోయిన్ మల్లికా షెరావత్ తెలిపింది. ఈ ఘటన వల్ల తాను భయపడ్డానని , ఆ క్షణం ఉన్నానా .. చనిపోయానా అనిపించిందని, ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలిపింది మల్లికా.

అర్ధరాత్రి తలుపు తట్టి చిత్రవధకు గురి చేశాడు..

Advertisement

మల్లికా షెరావత్ మాట్లాడుతూ.. ఆ టైంలో నేను దుబాయ్ లో ఒక పెద్ద సినిమా షూటింగ్ చేస్తున్నాను. ఆ సినిమా సూపర్ హిట్ కూడా అయింది. ఆడియన్స్ కి బాగా నచ్చడమే కాదు అందులో నటించినందుకు మాకు కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమాలో ఇద్దరు మల్టీ స్టారర్ హీరోలు నటించారు. అందులో నేను కామెడీ పాత్ర చేశాను. అయితే అప్పుడు జరిగిన ఆ విషయం ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది. ఆ ఇద్దరి హీరోలలో ఒక హీరో నన్ను చాలా చిత్రవధకు గురి చేశాడు. మేము ఉంటున్న హోటల్లో ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలకు నా గది తలుపు తట్టేవాడు. తలుపు తీయకపోతే డోర్ పగలగొట్టి.. బెడ్ రూమ్ లోకి వస్తానని బెదిరించేవాడు కూడా. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆడవారిగా మీరు కూడా ఆలోచించండి అంటూ అప్పటి భయానక పరిస్థితిని గుర్తు చేసుకుంది. అంతే కాదు ఆ సంఘటన తనను చాలా భయపెట్టింది అని ఆమె తెలిపింది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా .. నువ్వు అనుకున్నది ఏది జరగదు.. నేను తలుపు తీయను అంటూ వార్నింగ్ ఇచ్చాను. అయితే వార్నింగ్ ఇచ్చాను కానీ ఆ భయం నాలో పోవడానికి చాలా సమయం పట్టింది. ఇక తర్వాత అప్పటి నుంచి నేను మళ్ళీ అతడితో కలిసి నటించలేదు అంటూ తెలిపింది మల్లికా షెరావత్. అంతా తెలిపింది కానీ ఆ హీరో పేరు మాత్రం రిలీజ్ చేయలేదు ఈ ముద్దుగుమ్మ.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×