E-Paper
Advertisement

Manchu Vishnu : భక్తకన్నప్ప చరిత్ర న్యూజిలాండ్ లో.. ఇదేమి చిత్రం మంచు బాబు..

Manchu Vishnu : భక్తకన్నప్ప చరిత్ర న్యూజిలాండ్ లో.. ఇదేమి చిత్రం మంచు బాబు..
Advertisement
Manchu Vishnu

Manchu Vishnu : సినీ ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం.. ఇందులో పని చేసే నటీనటులకు కొన్ని పాత్రలు చేయాలి అన్న మక్కువ బలంగా ఉంటుంది. కొందరు అనుకున్న స్టోరీ ,అనుకున్న క్యారెక్టర్ చేసి రిలాక్స్ అయితే మరి కొందరు మాత్రం ఎంత కష్టపడ్డా అనుకున్న క్యారెక్టర్ని చేయలేక పోతారు. అలా ఎందరో స్టార్ హీరోలకు సైతం డ్రీం ప్రాజెక్ట్స్ మిగిలిపోయాయి. తమ డ్రీమ్ ప్రాజెక్ట్ చేసే అవకాశం రాకముందే వాళ్ళు రిటైర్ అయిపోయారు. అయితే కొందరు మాత్రం ఎంతో కష్టపడి ఎట్టకేలకు తమ డ్రీం ప్రాజెక్ట్ చేసే వదులుతారు.

అదే విధంగా ఎలాగైనా తన డ్రీం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అని పట్టుదలతో ఉన్నాడు మంచు విష్ణు.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప అని అందరికీ తెలిసిన విషయమే. తన కెరియర్ మొదలుపెట్టిన కొన్ని రోజుల నుంచి మంచు విష్ణు కి భక్తకన్నప్ప మూవీ చేయాలి అన్న డ్రీమ్ మొదలైంది.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు కోసమే అతను ఎంతగానో ప్రయత్నిస్తూ వచ్చాడు.

Advertisement

మోహన్ బాబు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచి విష్ణు మొదటిలో పర్వాలేదు అనిపించుకున్నా గత కొద్దికాలం గా పెద్దగా సినిమాలు ఏమీ చేయలేదు. అయినా పట్టు వదలకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం కొన్ని వందల మందితో చర్చలు జరిపిన మంచి విష్ణు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. పైగా ఈ మూవీ ని భారీ స్టార్లతో తెరకెక్కిస్తున్నాడు.

మంచు వారి భక్త కన్నప్ప మూవీ లో ప్రభాస్, మోహన్ లాల్‌ లాంటి ప్రముఖ స్టార్స్ నటించబోతున్న సంగతి తెలిసిందే. నటీనటులే అనుకుంటే ఇక మంచు విష్ణు షూటింగ్ కి ఎంచుకున్న లోకేషన్ కూడా భారీగా ఉంది. భక్తకన్నప్ప షూటింగ్ అంటే మామూలుగా కాళహస్తి దరిదాపుల్లో చేస్తారు అని అనుకుంటారేమో మంచు విష్ణు భక్తకన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ అడవులలో జరుగుతోంది. ప్రస్తుతం మంచు విష్ణు న్యూజిలాండ్ లో ఒక భారీ షెడ్యూల్‌ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయడానికి ప్లాన్ చేసినట్లుగా సమాచారం.

Advertisement

విష్ణు తన కన్నప్ప మూవీ కోసం న్యూజిలాండ్ వరకు ఎందుకు వెళ్లడం అని చాలా మంది అనుకున్నారు.. అయితే దీని వెనక అసలు విషయం ఏమిటో తెలుసా? భక్తకన్నప్ప చిత్రం ఆటవిక నేపథ్యంలో సాగుతుంది.. శివ భక్తుడైన కన్నప్ప అడవి బిడ్డ. కన్నప్ప జీవిత చరిత్రను చూపించేటప్పుడు కడు కమనీయమైన అడవి సౌందర్యాన్ని కూడా చూపించాలి. అందుకే షూటింగ్ న్యూజిలాండ్ లో ప్లాన్ చేశాడు.

న్యూజిలాండ్ అందమైన అడవి సోయగంతో పాటు మంచి టెక్నీషియన్స్ ని, కెమెరాలను ఉపయోగించి చిత్రాన్ని మరింత అద్భుతంగా చేయాలని విష్ణు భావిస్తున్నాడట. అందుకే ఈ మూవీ కోసం భారీ ఎత్తున ఖర్చు పెడుతూ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఎలాగైనా ఈ మూవీతో తిరిగి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి విష్ణు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×