E-Paper
Advertisement

Manjummel Boys: తెలుగులో కూడా దుమ్ములేపుతున్న మంజుమ్మేల్ బాయ్స్..

Manjummel Boys: తెలుగులో కూడా దుమ్ములేపుతున్న మంజుమ్మేల్ బాయ్స్..
Advertisement

Manjummel Boys: మలయాళ ఇండస్ట్రీ ఈ మధ్య హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. మంచి మంచి కథలతో సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీ మొత్తం మాలీవుడ్ గురించి మాట్లాడుకొనేలా చేస్తుంది. అంతేకాకుండా మలయాళ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేసి ఇక్కడ కూడా మలయాళ హీరోలు ఫేమస్ అవుతున్నారు. ఇప్పటికే ప్రేమలు తెలుగులో రిలీజ్ అయ్యి మంచి హిట్ ను అందుకున్న విషయం తెల్సిందే.

Advertisement

ఇక ఇప్పుడు.. మంజుమ్మేల్ బాయ్స్ కూడా తెలుగులో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. షౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి బాలు వర్గీస్ శ్రీధర్ పిళ్లై,గణపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. నేడు రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ అందుకుంటుంది.

మంజుమ్మేల్ బాయ్స్ ఒరిజినల్ స్టోరీ. కేరళలోని కొంతమంది అల్లరి కుర్రవాళ్ళు.. చేసిన ఒక తుంటరి పని వారి జీవితాలను ఎలా మార్చింది అనేదే సినిమా కథ. కేరళలో అల్లరి చిల్లరగా తిరిగే పదిమంది స్నేహితులు కొడైకెనాల్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. ఒక పెద్ద వ్యాన్ మాట్లాడుకొని అక్కడక్కడ ఆగుతూ కొడైకెనాల్ అందాలను ఆస్వాదిస్తూ గుణ కేవ్స్ కు వస్తారు. ఆ గుణ గుహలు ఎంతో ప్రమాదకరమైనవి కావడంతో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా ఉంటుంది. అయినా ఈ కుర్ర గ్యాంగ్ వాళ్ల కళ్లు కప్పి లోపలి వెళ్తారు. ఇక అలా వెళ్లిన పదిమందిలో ఒకడు.. అనుకోకుండా ఒక లోతైన గుహలో కాలుజారి పడిపోతాడు. ఇక వాడిని బయటకు తీసుకురావడానికి మిగతా తొమ్మింది మంది ఏం చేశారు.. ? ఫ్రెండ్ ను కాపాడుకోవడం కోసం వారు చేసిన సాహసం ఏంటి అనేది కథ.

Advertisement

సినిమా డాక్యుమెంటరీలా ఉందని కొంతమంది అన్నా.. అలాంటి ఫీలింగ్ రాకుండా మద్యమద్యలో కామెడీ ట్రాక్ ను పెట్టి డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. తెలుగులో కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ అవ్వడం విశేషం. వీకెండ్ లో ఫ్రెండ్స్ తో కలిసి చూసే సినిమా అని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా తెలుగులో ఎన్ని రికార్డ్ కలక్షన్స్ అందిస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×