E-Paper
Advertisement

Manjummel Boys Trailer: మలయాళ సూపర్ హిట్ మంజుమ్మెల్ బాయ్స్.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది

Manjummel Boys Trailer: మలయాళ సూపర్ హిట్ మంజుమ్మెల్ బాయ్స్.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
Advertisement


Manjummel Boys Trailer: ఒకప్పుడు మలయాళ సినిమాలు ఏం చూస్తారులే అనుకున్నవారంతా ఇప్పుడు మలయాళ సినిమాలను థియేటర్ కు వెళ్లి మరీ చూస్తున్నారు. అంతలా మాలీవుడ్ ఇండస్ట్రీ తన సత్తా చాటుతుంది. ఈ ఏడాదే వరుసగా మూడు బ్యాక్ టూ బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ అందుకుంది. ప్రేమలు, భ్రమ యుగం, మంజుమ్మెల్ బాయ్స్. ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మూడో సినిమా వంతు. ఆ సినిమానే మంజుమ్మెల్ బాయ్స్. మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా ఇది. సర్వైవల్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించాడు. కొంతమంది స్నేహితులు.. ఒక గుహను చూడడానికి వెళ్లి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది సినిమా కథ.

ఇక ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువాల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అర్జున్ కురియన్ కీలక పాత్రలు పోషించారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన మంజుమ్మెల్ బాయ్స్.. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ ను అందుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమా డబ్బింగ్ హక్కులను టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ కొనుగోలు చేయడంతో తెలుగులో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఏప్రిల్ 6 న ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్టర్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన మంజుమ్మెల్ బాయ్స్ ట్రైలర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Advertisement

” ఆ చోటు నిజమైన పేరు ఏంటో తెలుసా.. డెవిల్స్ కిచెన్.. సైతాను వంటగది” అని పోలీస్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. 11 మంది చిన్ననాటి స్నేహితులు.. కోడైకెనాల్ కు ట్రిప్ ప్లాన్ చేస్తారు. అక్కడ ఎంతో పేరు ఉన్న గుణ గుహలు చూడడానికి వెళ్తారు. అయితే ఆ గుహలోనే ఒక ఫ్రెండ్ కనిపించకుండాపోతాడు. కనిపించకుండా పోయిన తమ ఫ్రెండ్ కోసం మిగతావారు ఏం చేశారు.. ? అతను ఆ గుహలో ఎలా సర్వైవ్ అయ్యాడు.. ? అసలు ఆ గుహలో ఉన్నది ఎవరు.. ? అనేది సినిమా కథగా తెలుస్తోంది. కమల్ హాసన్ నటించిన గుణ సినిమా ఈ గుహలోనే చిత్రీకరించారు. అందుకే దానికి గుణ గుహా అనే పేరు వచ్చింది. అందుకు సింబాలిక్ గా గుణ సినిమాలోని మనుషులు అర్ధం చేసుకోవడానికి ఇది మాములు ప్రేమకాదు అనే డైలాగ్ ను వినిపించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×