తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న మంచు కుటుంబం (Manchu Family) లో గొడవలు ఒక్కసారిగా అగ్ని జ్వాలలు రగిలించాయి. అన్నదమ్ముల గొడవలు కాస్త కుటుంబ గొడవలుగా మారిపోయాయి. ముఖ్యంగా మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) అనుచరులే తనపై దాడి చేశారని, తన తండ్రి మోహన్ బాబు(Mohan Babu), అన్న మంచు విష్ణు (Manchu Vishnu)నుండి ప్రాణహాని ఉందంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మంచు మనోజ్(Manchu Manoj). ఇక ఆయనకు వ్యతిరేకంగా మోహన్ బాబు కూడా కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనిక (Mounika) కారణంగా ప్రాణహాని ఉందంటూ కామెంట్లు చేశారు. ఇక తర్వాత జల్పల్లి లో ఉన్న మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ ఘటన ముగిసిన తర్వాత మంచు విష్ణు(Manchu Vishnu)మీడియా ముందుకు వచ్చినప్పుడు కుటుంబ విషయాలు ఏవీ కూడా బయట చెప్పనని అందరిని ఆశ్చర్యపరిచారు.
విష్ణు పై మనోజ్ తప్పుడు ఆరోపణలు..
ఈ క్రమంలోనే మనోజ్ అమాయకుడని, మోహన్ బాబు, విష్ణు కలిసి మనోజ్ పై దాడి చేశారంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సడన్గా మంచు మోహన్ బాబు రెండవ భార్య, మనోజ్ తల్లి నిర్మల మోహన్ బాబు(Nirmala Mohan Babu)తన చిన్న కొడుకు మనోజ్ కి వ్యతిరేకంగా, పెద్దకొడుకు ఇన్నోసెంట్ అంటూ కామెంట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక మంచు నిర్మల పుట్టినరోజు సమయంలో తన అన్న మంచు విష్ణు తనను చంపాలని ప్లాన్ చేశాడంటూ మంచు మనోజ్ ఆరోపణలు చేయగా.. దీనికి ఆమె వ్యతిరేకంగా ఒక లేఖ వదిలింది. ఈ లేఖను పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు పంపడం జరిగింది. మరి మనోజ్ తల్లి నిర్మల రాసిన లేఖలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
పహాడీ షరీఫ్ పోలీసులకు లేఖ వదిలిన నిర్మలా మోహన్ బాబు..
మనోజ్ తల్లి ఆ లేఖలో.. “డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు మంచు విష్ణు జల్పల్లిలో వున్న మా ఇంటికి వచ్చి, కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశారు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్.. ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ ని బయటపెట్టి, దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేసి,పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు నాకు తెలిసింది. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే..నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు. అలాగే తన రూమ్ లో ఉన్న సామాను కూడా తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు కూడా నాతో ఉండి కేక్ కట్ చేయించి, సెలబ్రేట్ చేశాడు. అయితే నా చిన్న కొడుకు మనోజ్ కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కొడుకు విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. ముఖ్యంగా నా పెద్దకొడుకు విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు. గొడవ చేయలేదు. మనోజ్.. విష్ణుపై చేసిన కంప్లైంట్ లో నిజం లేదు. ఇంట్లో పని చేస్తున్న వాళ్లు కూడా “మేము ఇక్కడ పనిచేయలేమని” వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఏమాత్రం లేదు. విష్ణు జల్పల్లి లో ఉన్న మా ఇంటికి వచ్చాడు.. నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు.. తన సామాను తీసుకొని వెళ్ళిపోయాడు.. అంతకుమించి ఇక్కడ ఏమీ జరగలేదు” అంటూ నిర్మల కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.