BigTV English

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Gold Particles: బంగారం.. మన దేశంలో బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ.. గోల్డ్ కు ధరలు ఎంత పెరిగినా.. కొనడానికి మాత్రం వెనుకాడరు.. బంగారం ధర ఇటీవల లక్షకు చేరినా కొనేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అది భారతదేశంలో గోల్డ్ కు ఉన్న డిమాండ్. అయితే ఓ కుటుంబం మురుగు నీరు (డ్రైనేజీతో కూడిన నీరు)లో చిన్న చిన్న బంగారు రేణువులను వెలికి తీసి జీవనం కొనసాగిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం, కోయంబత్తూరు నగరానికి చెందిన ఓ 20 కుటుంబాలు ఇదే వృత్తిని నమ్ముకుంటూ బతుకుతున్నారు. అసలు మురుగునీటి నుంచి బంగారాన్ని ఎలా వేరు చేస్తారు..? అలా ఎంత సంపాదిస్తారు..? అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే..


కోయంబత్తూరు నగరంలోని ఉక్కడం వద్ద కోయంబత్తూరు కార్పొరేషన్ స్థాపించిన మురుగునీటి శుద్ధి కేంద్రం సమీపంలో ఒక ప్రత్యేకమైన జీవనోపాధి కనిపిస్తోంది. ఇక్కడ సుమారు 20 కుటుంబాలు మురుగునీటి నుంచి బంగారు రేణువులను వడపోసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. నగరంలోని వందలాది ఆభరణాల (గోల్డ్) షాపులు ఉన్నాయి. ఆ షాపుల్లో నిత్యం వందల కేజీలు ఆభరణాలను తయారు చేసి విదేశాలకు పంపిస్తుంటారు. అయితే ఈ ఆభరణాలను తయారు చేసే క్రమంలో బంగారం నుంచి చిన్న చిన్న బంగారు రేణువులు మురుగునీటిలో వేస్టేజ్ గా కలిసిపోతుంటాయి. ఈ రేణువులను సేకరించి, వడపోసి ఈ 20 కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయి. అయితే, ఈ ప్రక్రియలో వాడే సాంప్రదాయ పద్ధతులు చాలా కష్టంతో కూడుకున్న పని.

ఈ బంగారు వడపోత ప్రక్రియలో మురుగునీటి నుంచి మట్టిని సేకరిస్తారు. ఆ మట్టి ఎండలో ఆరబెడతారు. ఎండబెట్టిన అనంతరం ఆ మట్టి ముద్దలు అన్నీ పొడిపొడిగా మారుతాయి. ఈ మట్టి పొడిని మురుగునీటితో కలిపి, చెక్క పలకలపై వడపోస్తారు. ఇలా మూడు నుంచి నాలుగు సార్లు వడపోస్తుంటారు. ఈ ప్రక్రియలో కొంచెం మురికి మట్టితో కూడిన బంగారు రేణువులు కనబడతాయి. చివరకు పాదరసం సహాయంతో ఈ కుటుంబాలు బంగారు రేణువులను వేరు చేస్తారు. ఇలా వేరు చేసిన బంగారాన్ని స్థానిక షాపుల్లో వ్యాపారస్థులకు అమ్ముతారు. ఇలా ఒక్కో కుటుంబ రోజుకు బంగారాన్ని వేరు చేస్తూ రూ.1000 నుంచి రూ.2000 సంపాదిస్తుంటారు. నెలకు ఓ కుటుంబం 30వేల వరకు సంపాదిస్తోంది. కొన్ని కుటుంబాలు ఇదే పని చేస్తూ రూ.50వేల వరకు కూడా సంపాదిస్తున్నారు. కొంతమంది పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో కలిసి ఈ పనిలో సహాయం చేస్తున్నారు.


ALSO READ: IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

అయితే.. ఇటీవల ఆభరణాల తయారీ సమయంలో మురుగునీటిలో కలిసే బంగారం పరిణామం చాలా తగ్గింపోయిందని.. ఇప్పుడు అసలు గోల్డ్ చాలా తక్కువ పరిణామంలో దొరుకుతోందని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మురుగునీటి నుంచి బంగారాన్ని వేరు చేయడానికి మిషన్లు వచ్చాయని.. తమకు ప్రస్తుతం బంగారం కనబడడం లేదని చెబుతున్నారు. నెలంతా కష్టపడితే అవసరాలకు కూడా సరిపోవడం లేదని వారు బాధను వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మా పిల్లలు ఇలాంటి పనులు చేయొద్దని దేవుడుని కోరుకుంటున్నట్టు వారు చెబుతున్నారు. తమ కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరుతున్నారు.

ALSO READ: NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

అయితే, మురుగు నీటి నుంచి బంగారాన్ని వేరు చేసే ప్రక్రియలో అక్కడి స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. డ్రైనేజీ అంతా ఒక్క దగ్గర జామ్ కావడంతో వాసన భరించలేకపోతున్నామని చెబుతున్నారు. అక్కడ సమీపంలోని అన్బు నగర్, రోజ్ పార్క్, రోజ్ అవెన్యూ, రేష్మా గార్డెన్, నీలా గార్డెన్, ఎన్.ఎస్. పార్క్ వంటి నివాస ప్రాంతాలు ఇబ్బందులు పడుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాసనను నిరంతరం పీల్చడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు సంభవించవచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×