The Big folk night-2025:రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో తాజాగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse) హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సత్యదేవ్ (Sathyadev) కీలక పాత్ర పోషించారు. మలయాళం నటుడు వీపీ వెంకటేష్ (VP Venkatesh) విలన్ గా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా జానపద పాటలకు భవిష్యత్తు అందించడానికి.. నాటితరమే కాదు భవిష్యత్తు తరం సైతం సాంస్కృతి కళలకు జీవం పోసేలా బిగ్ టీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ‘ది బిగ్ ఫోక్ నైట్ – 2025’. ఈ కార్యక్రమాన్ని ఎలిమెంటల్ మీడియా, ఎంట్రీవాలా టికెటింగ్ పార్ట్నర్లుగా బిగ్ టీవీ ‘ది బిగ్ ఫోక్ నైట్ – 2025’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ది బిగ్ ఫోక్ నైట్ – 2025 టికెట్ పై బంపర్ ఆఫర్..
.
ఈ కార్యక్రమం ఈనెల 23వ తేదీన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఇకపోతే ఆగస్టు 23న సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.అయితే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి విజయ్ దేవరకొండ కూడా రంగంలోకి దిగారు. అందులో భాగంగానే ఆయన ఒక ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేస్తూ ఈ కార్యక్రమానికి టికెట్టు పొందాలి అంటే..’KINGDOM20′ కూపన్ కోడ్ ఉపయోగించి.. ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్ పై 20% డిస్కౌంట్ పొందవచ్చు అని హీరో విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. అయితే ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 10 వరకు మాత్రమే ఉంటుంది అని తెలిపారు. ఇక మొత్తానికి అభిమానులు ఈ బంపర్ ఆఫర్ అందుకోవాలి అంటే విజయ్ దేవరకొండ చెప్పిన కోడ్ ఉపయోగిస్తే 20% టికెట్ పై డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్స్ ‘ఎంట్రీ వాలా’ యాప్ ద్వారా లభిస్తాయి.
జానపద పాటలకు ప్రాణం పోయేడమే ఈ కాన్సర్ట్ ముఖ్య ఉద్దేశం..
సాధారణంగా లైవ్ కాన్సర్ట్స్ అంటే సంగీత దర్శకులు ఇప్పటివరకు తమ కెరియర్లో బెస్ట్ గా నిలిచిన పాటలను లైవ్ లో ఆలపించి అందరిని ఆకట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు జానపద పాటలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చిన సందర్భాలు లేవు. సాంస్కృతిక కళలకు జీవం పోసేలా.. తెలంగాణ గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లేలా అటు జానపద పాటలు ఆలపిస్తున్న గాయని గాయకులకు ప్రోత్సాహాన్ని కలిగిస్తూ.. బిగ్ టీవీ అతిపెద్ద వేదిక కానుంది. ముఖ్యంగా జానపద కళాకారులకు చేయూత అందించేందుకు తెలంగాణ చరిత్రలోనే తొలిసారి అతిపెద్ద ప్రోగ్రాం నిర్వహించనున్నారు. మొత్తం 60 మంది జానపద గాయని గాయకులు ఈ వేదికపై సందడి చేయనున్నారు. ఇదివరకే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, ప్రోమో లాంచ్ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు.. అటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ జానపద గాయని గాయకులు కూడా తెగ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి బిగ్ టీవీ శ్రీకారం చుట్టడంతో రాష్ట్ర ప్రజలే కాదు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.