Allu Arha – Manchu Lakshmi: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలే కాదు వారి పిల్లలు కూడా భారీగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.ఇప్పటికే ఇండస్ట్రీలోకి రాకపోయినా ఇలా సోషల్ మీడియా ద్వారా ఊహించని క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) పిల్లలతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పిల్లలు కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నారు. ఆ ట్రెండ్ కారణంగానే అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ (Allu Arha) ఏకంగా సినిమాలో కూడా అవకాశాన్ని కొట్టేసి తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది.
ఆసక్తికరంగా మారిన అల్లు అర్హ వీడియో..
సమంత (Samantha) లీడ్ రోల్ పోషిస్తూ.. గుణశేఖర్ (Guna Sekhar) దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ సినిమాలో చిన్నప్పుడు భరతుడి పాత్రలో చాలా చక్కగా నటించింది అల్లు అర్హ. ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా నెట్టింట ఈమె తన తండ్రితో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరికి సంబంధించిన వీడియోలను కూడా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అర్హ ముద్దు ముద్దు మాటలతో విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్హకి సంబంధించిన మరో వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మికి అర్హ ప్రశ్న..
ఆ వీడియోలో అల్లు అర్హ మంచు లక్ష్మీని అడిగిన ప్రశ్న అందరిలో నవ్వు తెప్పిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. మంచు లక్ష్మి ఇటీవల అల్లు అర్జున్ ఇంటికి వచ్చింది. అందులో భాగంగానే బన్నీ వీడియో క్యాప్చర్ చేస్తూ ఉండగా.. మంచు లక్ష్మి అర్హతో మాట్లాడుతూ..” నువ్వు ఏదో నన్ను అడగాలని అనుకుంటున్నావ్ అంట కదా.. ఏం అడుగుతావో చెప్పు” అని అర్హను అడిగింది మంచు లక్ష్మి. దీంతో అర్హ..” నువ్వు తెలుగేనా?” అంటూ చాలా క్యూట్ గా ప్రశ్నించింది.
అర్హ క్యూట్ ప్రశ్నకి షాక్ లో మంచు లక్ష్మి..
ఈ మాట విన్న మంచు లక్ష్మి మొదట షాక్ అయినా..” నేను తెలుగునే పాప.. అంత డౌట్ ఎందుకు వచ్చింది నీకు.. నేను నీతో తెలుగులోనే కదా మాట్లాడుతోంది”అంటూ అడుగుతుంది. వెంటనే అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “నీకెందుకు ఆ డౌట్ వచ్చింది?” అని అడగ్గా.. మంచు లక్ష్మీ కూడా మళ్లీ అదే ప్రశ్ననే అడిగింది. అప్పుడు అర్హ సమాధానం ఇస్తూ..” నీ యాక్సెంట్ అలా ఉంది” అంటే.. “నీది కూడా అలాగే ఉంది కదా” అంటూ అర్హకు సమాధానమిచ్చింది లక్ష్మి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది నెటిజన్స్ క్యూట్ కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది మంచు లక్ష్మీ పరువు పోయే అంటూ సరదాగా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Cute 😍🥰
arha with manchu Lakshmi #AlluArjun𓃵 pic.twitter.com/wIDCTasf7p— Bunny🐉 (@me_Alone3) August 7, 2025
ALSO READ: War 2 Song Teaser: అదరగొట్టేసిన డాన్స్ ఐకాన్స్.. రెండు కళ్ళు చాల్లేదు గురూ!