Kaantha: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో కుర్ర హీరోలు మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నారు. అలా అన్ని భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. గతేడాది పాన్ ఇండియా లెవెల్లో లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత దుల్కర్ నటిస్తున్న చిత్రం కాంత. సెల్వరాజ్ సెల్వమణి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రానా దగ్గుబాటితో కలిసి దుల్కర్ సల్మాన్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా నటుడు, డైరెక్టర్ సముద్రఖని కీలకపాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. సినిమా నుంచి లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే కాంత నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. పసి మనసే అంటూ సాగే సాంగ్ ను రేపు సాయంత్రం అనగా ఆగస్టు 9 సాయంత్రం 4.30 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలుపుతూ ఒక ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.
ఇక ఈ ప్రోమోలో దుల్కర్ – భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యినట్లు కనిపిస్తుంది. మొదటి నుంచి భాగ్యశ్రీ అందాల ఆరబోత, హీరోలతో కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అవుతూ వచ్చాయి. ఆమె నటించిన మొదటి సినిమా మిస్టర్ బచ్చన్ లో రవితేజ తో కూడా ఈ రేంజ్ లో కెమిస్ట్రీ చూపించి పిచ్చెక్కించింది. ఇక మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండతో కింగ్డమ్ లో ఏకంగా పెదవి ముద్దులు ఇచ్చి కైపెక్కించింది.
అంత రెచ్చిపోయినా అమ్మడికి ఆ సినిమాలు అంతగా విజయాలను అందించలేకపోయాయి. ఇక ఇప్పుడు ఈ చిన్నదాని ఆశలన్ని ఈ సినిమాపైనే పెట్టుకున్నాయి. 1950 లో జరిగిన కథగా కాంత తెరకెక్కుతుంది. ఇందులో దుల్కర్ – భాగ్యశ్రీ మధ్య పలు రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయని టాక్. మరి ఈ సినిమాతో భాగ్యశ్రీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Love blossoms on the silver screen! ❤ Check out ‘PANIMALARE’, the first song of #Kaanthafilm tomorrow at 4:30pm and watch #Bhagyashriborse and I take center stage. 💃🏻✨ Know our story on September 12, releasing worldwide.
A @SpiritMediaIN and @DQsWayfarerFilm production 🎬… pic.twitter.com/Q0YRJjhLVK
— Dulquer Salmaan (@dulQuer) August 8, 2025