నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మా…
నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా..
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా…
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా…
అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా…
నువ్వే లేక వసివాడానమ్మా…
అయ్యో వెళ్ళిపోయావే… నన్నొదిలేసి ఎటు పోయావే…
ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినీ ఇండస్ట్రీలో వేలాది పాటలు అమ్మ ప్రేమను తెలిపేలా ఉంటాయి. కానీ, సినీ ఇండస్ట్రీలో ఉన్న కొంత మందికి ఈ అమ్మ ప్రేమేంటో తెలియడం లేదు.
భరించరాని ప్రసవవేదన ఉన్నా… తన పొత్తిళ్లలో బిడ్డను చూసి అన్నీ మరిచిపోతుంది అమ్మా. నవమాసాలు కడుపులో మోయడమో కాదు… జీవితాంతం ఆ బిడ్డ వెన్నంటే ఉండాలని అనుకుంటుంది. ఆ బిడ్డ కూడా తాను వేసే ప్రతి అడుగులో అమ్మ ఉండాలని అనుకుంటాడు. కానీ, అలాంటి అమ్మ ఒక్క సారిగా దూరమైతే ఎలా ఉంటుంది..? జీవితమే అంధకారమే కదా…
ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న కొంత మందికి అర్థమవ్వడం లేదు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఇప్పటికే అందరికీ అర్థం అయిపోయివచ్చు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనతో ఓ తల్లి కన్నుమూసింది. ఆ తల్లికి ఉన్న ఇద్దరి బిడ్డల్లో ఓ బిడ్డ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనకు ఒక రకంగా కారణమైన అల్లు అర్జున్ మాత్రం తన పిల్లలతో హ్యాపీగా ఉన్నాడు అంటూ నెటింట్లో వస్తున్న రచ్చ చూస్తూనే ఉన్నాం. అల్లు అర్జున్ ఒక 6 గంటలు పిల్లలకు దూరమైతేనే వాళ్ల పిల్లలు బెంగ పెట్టుకుంటే.. అక్కడ రేవతి భర్త, ఆమె పిల్లల పరిస్థితి ఏంటి అంటూ మానవతావాదులు, తల్లి ప్రేమ అంటే ఏంటో తెలిసిన వాళ్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు, కామెంట్స్ పెడుతూనే ఉన్నారు.
ఇలాంటి టైంలో కొంత మంది అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డికి ఓ సందేహం ఇస్తున్నారు. అల్లు స్నేహ రెడ్డి ఓ మంచి భార్య. అంత కంటే మంచి అమ్మ. అల్లు అయాన్, అల్లు అర్హకు తల్లిగా వందకు వంద శాతం న్యాయం చేస్తూ తల్లి ప్రేమను పంచుతుంది. అయితే ఆ తల్లి ప్రేమ ఏంటో, ఎలా ఉంటుందో, ఆ బిడ్డకు తల్లి దూరమైతే ఎలాంటి ఆ బిడ్డ వేదన ఉంటుందో అల్లు అర్జున్ కు కూడా చెప్పాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి.
మనిషి బతకాలంటే.. బ్రాండ్ కాదు.. కాసింత ప్రేమ కావాలి. అందులోనూ తల్లి ప్రేమ పక్కన ఉంటే ఎలా ఉంటుందో అల్లు అర్జున్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, తల్లి కోల్పోయి, హస్పిటల్ బెడ్‌పై ప్రాణాలతో పోరాడుతున్న శ్రీ తేజ్ విషయంలో ఈ కోణంలో అల్లు అర్జున్ ఎందుకు ఆలోచించడం లేదు. అల్లు అర్జున్ కు తల్లిని కోల్పోయిన ఆ బిడ్డల పరిస్థితి అర్థమయ్యేలా చెప్పాలి అంటే కేవలం స్నేహ రెడ్డికే సాధ్యమవుతుంది అంటూ నెట్టింట్లో కామెంట్స్ రావడం మనం చూస్తున్నాం..
కేవలం 6 గంటలు మాత్రమే తన పిల్లలకు దూరంగా ఉన్న అల్లు అర్జున్… తర్వాత లైవ్ కెమెరాలు పెట్టి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇప్పటికీ కూడా తన ఇంటికీ సెలబ్రెటీలు వస్తూనే ఉన్నారు. కానీ, అక్కడ ఓ త్లలి ప్రాణం పోయింది. బిడ్డ శ్రీతేజ్ ప్రాణాలు గాల్లో ఉన్నాయి. ఇలాంటి టైంలో ఆ బిడ్డకు అల్లు అర్జున్ పరామర్శ వీడియోలకు, మీడియాకే పరిమితం అయిందే తప్పా… ప్రత్యేక్షంగా ఆ బిడ్డ దగ్గరకి వెళ్లి మాట్లాడలేదు. ఆ బిడ్డ భవిష్యత్తుపై హామీ కూడా కరవైంది.
అందులోనూ హాస్పిటల్ బెడ్ పై ప్రాణాలతో పోరాడుతున్న బిడ్డ శ్రీతేజ్.. అల్లు అర్జున్ కు పెద్ద ఫ్యాన్. బన్నీకి చాలా మంది ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ, ఓ సినిమాకు టికెట్ 2000 రూపాయలు పెట్టి. తానే కాదు… తన ఫ్యామిలీలో నలుగురితో 4 టికెట్లు కొనిపించి… తన అభిమాన హీరో సినిమాను అందరి కంటే ముందుగా ఫస్ట్ షోనే చూడాలి అనుకునే వీరాభిమానులు చాలా కొద్ది మంది ఉంటారు. అలాంటి కొంత మంది ఫ్యాన్స్ లో శ్రీతేజ్ ఇప్పుడు హాస్పిటల్‌లో ఐసీయూలో వెంటిలెటర్‌పై చికిత్స తీసుకుంటున్నాడు. దీనికి కారణం ఎవరో అందరికీ తెలిసిందే.
అలాంటి వీరాభిమాని కోసం అల్లు అర్జున్ ఎంత చేసినా… తక్కువే అందులోనూ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో ఆ వీరాభిమాని తల్లి చనిపోయింది. ఇలాంటి టైంలో ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం అని చెప్పుకునే అల్లు అర్జున్ ఇప్పటికైనా శ్రీతేజ్ దగ్గరకి వెళ్లి చూడాలి. ఆ పిల్లల భవిష్యతు నాది అనే ధీమా ఆ తండ్రికి ఇవ్వాలి. చనిపోయి ఆ పైలోకంలో ఉన్న రేవతి ఆత్మ ప్రశాంతంగా ఉండేలా చూడాలి.
శ్రీతేజ్‌ను కలవడానికి తనకు లీగల్ అడ్డంకులు ఉన్నాయని ఓ ట్వీట్ వేశాడు అల్లు అర్జున్. శ్రీతేజ్, రేవతి కుటుంబం భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి అల్లు అర్జునే వెళ్లాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ భార్య.. పిల్లలు అంటే స్నేహరెడ్డికి చాలా తెలుసు. ఆమెను పంపించొచ్చు. అలాగే అల్లు నిర్మలమ్మ ఉంది. అందరి కంటే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఉండనే ఉన్నారు. కానీ, ఆ విధంగా ఎందుకు ఆలోచిచండం లేదు అనేది ఇప్పుడు అందరి నుంచి వస్తున్న మాట.