BigTV English

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Rishabh Pant :  దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Rishabh Pant :  టీమిండియా(Team India)  క్రికెటర్ రిషబ్ పంత్ (Rishab pant)  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతని ఆట గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. ముఖ్యంగా ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్ట్ సిరీస్ మ్యాచ్ ల్లో రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తన కాలుకి గాయం కారణంగా 5వ టెస్ట్ మ్యాచ్ కి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రిషబ్ పంత్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. మానవత్వం ప్రదర్శించడంలోనూ అంతే దూకుడుగా ఉంటాడు. ఇటీవల ఇంగ్లాండ్ గడ్డ పై పాదం ఫ్రాక్షర్ అయినా బరిలోకి దిగి యావత్ క్రికెట్ ప్రపంచంతో ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ను 2-2 తో ముగించిన టీమిండియా స్వదేశానికి చేరుకుంది. ఈనెలలో భారత జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ లో ఎలాంటి సిరీస్ లేవు.


Also Read :  Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

ఆ మ్యాచ్ లకు పంత్ దూరం 


సెప్టెంబర్ 09న ప్రారంభం కానున్న ఆసియా కప్ తో టీమిండియా మళ్లీ వరుస మ్యాచ్ లతో బిజిబిజీగా మారనుంది. టీ-20 ఫార్మాట్ లో జరుగనున్న ఆసియా కప్ కు మరో రెండు, మూడు వారాల్లో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టులో బ్యాటింగ్ చేస్తూ.. గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఈ టోర్నీకి దూరమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అతనికీ సర్జరీ అవసరం లేదని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. అయితే పూర్తి స్థాయిలో కోలుకోవడానికి 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్ తో ఆసియా కప్ ముగియనుంది.

మొత్తం నాలుగు సిరీస్ లు.. 

ఇక అక్టోబర్ 2 నుంచి 14 వరకు స్వదేశంలో భారత్ రెండు టెస్ట్ మ్యాచ్ లు (అహ్మదాబాద్, ఢిల్లీ)లో ఆడనుంది. ఈ సిరీస్ లో కూడా రిషబ్ పంత్ బరిలోకి దిగేది అనుమానంగా కనిపిస్తోంది. పంత్ ఆడకపోతే ధ్రువ్ జురెల్ ప్రధాన వికెట్ కీపర్ గా ఉంటాడు. అక్టోబర్ లోనే భారత వన్డే, టీ-20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆసీస్ తో జరిగే మూడు వన్డేలు, 5 టీ-20ల సిరీస్ తో పంత్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో మొత్తం 479 పరుగులు చేసి కీలక బ్యాట్స్ మెన్ లలో ఒకడిగా మారాడు. మరోవైపు ఆసియా కప్ లో భారత్ లీగ్ దశలో సెప్టెంబర్ 10న యూఏఈతో దుబాయ్ వేదికగా జరిగింది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో జరుగనుంది. ఈ మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగానే జరుగుతుంది. సెప్టెంబర్ 19న ఒమన్ తో దుబాయ్ వేదికగానే జరుగనుంది. WTC ఫైనల్ 2023, ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023, ఆసియా కప్ 2025 కప్ లను మిస్ అయ్యాడు రిషబ్ పంత్. మొత్తానికి రిషబ్ పంత్ గాయం కారణంగా 4 సిరీస్ లకు దూరం అయ్యాడనే చెప్పవచ్చు. ఇప్పటికే మూడింటికి దూరం కాగా.. సెప్టెంబర్ లో జరిగే ఆసియా కప్ కి దూరం కానున్నాడు.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×