BigTV English

War2 Pre Release: వార్ 2 ప్రీ రిలీజ్ వేడుకకు సర్వం సిద్ధం… ఎప్పుడు.. ఎక్కడంటే?

War2 Pre Release: వార్ 2 ప్రీ రిలీజ్ వేడుకకు సర్వం సిద్ధం… ఎప్పుడు.. ఎక్కడంటే?

War 2 Pre Release: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోలుగా నటించిన చిత్రం వార్ 2(War 2).బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యశ్ రాజ్ ఫిలిమ్ యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలకు హాజరవ్వడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరు హీరోలు సరదాగా గొడవ పడుతూ సినిమాకు కావలసినంత హైప్ పెంచుతూ ఉన్నారు.


యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్..

ఇకపోతే ఈ సినిమా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను(Pre Release Event) నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి అధికారిక ప్రకటన తెలియజేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఆగస్టు 10వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నట్లు మేకర్స్ అధికారక పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ముఖ్య అతిథిగా రాజమౌళి?

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఏ హీరోలు అతిథులుగా వెళ్తున్నారని విషయాలు తెలియాల్సి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రశాంత్ నీల్ తో పాటు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని సమాచారం. ఇక ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎవరు రాబోతున్నారనే విషయాల గురించి చిత్ర బృందం ఎక్కడ వెల్లడించలేదు. ఇక ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

తెలుగు హక్కులు కొన్న నాగ వంశీ..

ఈ సినిమా తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ అధినేత నాగ వంశీ(Nagavamshi) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వేడుకను హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా విషయానికి వస్తే… ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కు ఇది మొదటి బాలీవుడ్ సినిమా కావటం విశేషం. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇందులో కియారా అద్వానీ (Kiara Advani)హీరోయిన్ గా నటించబోతున్నారు. ఈ సినిమా నుంచి దునియా సలాం అనాలి అనే పాట టీజర్ విడుదల చేశారు. ఇక ఈ టీజర్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ చాలా స్టైలిష్ స్టెప్పులతో పోటీపడి డాన్స్ చేశారని చెప్పాలి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి సాంగ్ థియేటర్లోనే చూడాల్సి ఉంటుంది. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి.

Also Read: Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Related News

Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Big Stories

×