BigTV English

Couple Friendly : అమ్మ బాబోయ్ ఆ కిస్సులు ఏంటన్నా, సంతోష్ శోభన్ రూట్ మార్చాడు భయ్యా

Couple Friendly : అమ్మ బాబోయ్ ఆ కిస్సులు ఏంటన్నా, సంతోష్ శోభన్ రూట్ మార్చాడు భయ్యా

Couple Friendly : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది హీరోలను చూసినప్పుడు ఇంత టాలెంట్ ఉండి కూడా వీళ్లకు సరైన హిట్ సినిమా పడలేదు అని అనిపిస్తుంది. అలాంటి నటులలో ఆకాష్ పూరి, సంతోష్ శోభన్ వంటి హీరోల పేర్లు ఖచ్చితంగా వినిపిస్తాయి.


గోల్కొండ హై స్కూల్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన సంతోష్ శోభన్ తన కెరియర్లో కొన్ని మంచి కథలను ఎంచుకున్నాడు. కానీ ఆ కథలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాయి. చివరిగా ప్రేమ్ కుమార్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంతోష్ శోభన్. ప్రస్తుతం కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.

ఇంప్రెస్సివ్ టీజర్ 


ప్రస్తుతం సంతోష్ శోభన్, మానస వారణాసి ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా కపుల్ ఫ్రెండ్లీ. ఈ సినిమా టీజర్ కొద్దిసేపటికి క్రితమే విడుదలైంది. ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ మంచి రెస్పాన్స్ సాధించుకుంటుంది. టీజర్ లో సంతోష్ శోభన్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం సమాజంలో ఉన్న రాపిడో యాప్ లా ప్రయాణికులను వారి గమ్యంలో దించుతూ ఉంటాడు.  అలానే హీరోయిన్ పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మరి ప్రేమకు దారి తీసి ఇద్దరు దగ్గరయ్యే వరకు చేరుతుంది. చాలా సింపుల్ గా క్యూట్ మూమెంట్స్ తో దీనిని ప్రజెంట్ చేశాడు దర్శకుడు చంద్రశేఖర్. అయితే ఇప్పటివరకు డీసెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంతోష్ శోభన్ తన రూట్ మార్చాడు అని చెప్పొచ్చు. టీజర్ లో కొన్ని కిస్సెస్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి.

కమర్షియల్ సక్సెస్ 

రీసెంట్ టైమ్స్ లో ఇటువంటి సినిమాలకే మంచి సక్సెస్ ఉంటుంది. బేబీ అనే సినిమా ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు రియాలిటీ కి దగ్గరగా ఉన్న కథలను కోరుకుంటున్నారు అని చెప్పడానికి ఆ సినిమా సక్సెస్ ఒక నిదర్శనం. ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ టీజర్ చూస్తుంటే చాలా మందికి విపరీతంగా కనెక్ట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రేమలో కొత్త కొత్త పదాలు వచ్చేసాయి. అవసరాల కోసం ప్రేమ అనే పేరును వాడుకోవడం ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. మొత్తానికి ఈ కపుల్ ఫ్రెండ్లీ టీజర్ ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. దీనితో కమర్షియల్ సక్సెస్ వచ్చే అవకాశం కూడా ఉంది. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Also Read: Nagarjuna: కూలీ సినిమాతో పాటు ఆ బ్లాక్ బస్టర్ సినిమా ట్రైలర్, నాగార్జున మామూలు ప్లానింగ్ కాదు

Related News

kaantha Movie: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ ‘కాంత’ మూవీ ఫస్ట్ సాంగ్ అవుట్

Coolie vs War 2 : వార్‌కి ఇది సరిపోదు… మిగిలింది ఈ ఒక్క ఛాన్సే

Vadde Naveen: పదేళ్ల తర్వాత రీఎంట్రీ.. ఈ కానిస్టేబుల్ కష్టాలేందుకు నవీన్..

Bollywood: రక్షాబంధన్ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ సోదరి పోస్ట్!

Niharika Konidela: మెగా బ్రదర్స్ తో నిహారిక రాఖీ సెలబ్రేషన్స్.. ఆకట్టుకున్న ఫోటోలు!

Aamir Khan Brother: ఏడాది పాటు గదిలో బంధించాడు.. ఏవేవో మందులు ఇచ్చి చిత్రహింసలు పెట్టాడు.. ఆమిర్ ఖాన్ పై సోదరుడి ఆరోపణలు

Big Stories

×