నగరాల్లోనూ పట్టణాల్లోనూ అద్దె ఇళ్లకు గిరాకీ భారీగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో పనులు తగ్గిపోవడంతో పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరగడంతో పెద్ద ఎత్తున ప్రజలు అర్బన్ ప్రాంతాలకు తరలి వస్తున్నారు. దీనితో రెంటల్ మార్కెట్ భారీగా పెరిగింది అని చెప్పవచ్చు. నగరాల్లో స్థిరపడిన వారు తమ ఇళ్లలో అదనపు పోర్షన్లను కట్టించుకొని అద్దెకు ఇచ్చేందుకు ఇష్టపడుతున్నారు. తద్వారా వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి బిజినెస్ హైదరాబాద్ నగరంలో ఎక్కువగా సాగుతోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో ఈ అద్దె ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారు కూడా తమ ఫ్లాట్స్ అద్దెకు ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వారికి అదనపు ఆదాయం లభిస్తోంది. . అయితే ఇంతకాలం అదే మార్కెట్ అనేది వ్యవస్థీకృతంగా లేదు.
సాధారణంగా ఎలాంటి రెంటల్ అగ్రిమెంట్స్ అనేవి లేకుండానే కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మాత్రమే ఈ అద్దె ఒప్పందాలు అనేవి జరుగుతుంటాయి, కానీ ఈ మధ్యకాలంలో రెంటల్ అగ్రిమెంట్స్ అనేవి తప్పనిసరి అయ్యాయి. దీనికి ప్రధాన కారణం కార్పొరేట్ కంపెనీల్లో పని చేసేవారు టాక్స్ ఫైలింగ్ సమయంలో హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకోవడానికి రెంటల్ అగ్రిమెంట్ అనేది తప్పనిసరి అయింది. దీనికి తోడు ప్రస్తుతం ప్రభుత్వం డిజిటల్ రెంటల్ అగ్రిమెంట్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఉన్నటువంటి స్టాంపు పేపర్ రెంట్ అగ్రిమెంట్ స్థానంలో డిజిటల్ రెంట్ అగ్రిమెంట్ చేసుకోవాలని సరికొత్త రూల్ జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలులో ఉంది ఈ కొత్త రూల్ ప్రకారం ఎవరైతే డిజిటల్ రెంట్ అగ్రిమెంట్ చేసుకోలేదు వారిపై ఐదువేల రూపాయల జరిమానా విధించనున్నారు.
మారిన నిబంధనలు ఇవే :
>> నిజానికి సాంప్రదాయ పద్ధతుల్లో స్టాంపు పేపర్ పైన ఈ రెంటల్ అగ్రిమెంట్ అనేది ఇంటి ఓనర్, కిరాయిదారుడు కలిసి ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రెంటల్ అగ్రిమెంట్ క్లాసులను మార్చింది. ఇందులో భాగంగా జూలై ఒకటో తేదీ నుంచి డిజిటల్ రెంట్ అగ్రిమెంటును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
>> ఎవరైతే కొత్త నిబంధనను పాటించకుండా ఉంటారో వారిపై ముఖ్యంగా ఇంటి అదేదారుడు లేదా యజమానిపై ఐదు వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
>> అయితే ఈ డిజిటల్ అగ్రిమెంట్ అనేది ఆయా రాష్ట్రాల డిజిటల్ స్టాంప్ పోర్టల్ ఉపయోగించి చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాంపు పోర్టల్ ద్వారా ఈ డిజిటల్ రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చుకోవచ్చు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్టాంప్ పోర్టల్ ఏర్పాటు చేసింది.
కొత్త నిబంధనల వల్ల ఇకపై రెంటల్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా మరింత పారదర్శకంగాను చట్టబద్ధంగా ఉండేందుకు వీలు కలుగుతుంది. అంతేకాదు దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తినా పరిష్కరించుకునేందుకు సులభతరం అవుతుంది.