BigTV English

Janhvi Kapoor: తడిచీరలో దేవర బ్యూటీ అందాల విందు.. పరమ్ సుందరి రెయిన్ సాంగ్ చూశారా ..?

Janhvi Kapoor: తడిచీరలో దేవర బ్యూటీ అందాల విందు.. పరమ్ సుందరి రెయిన్ సాంగ్ చూశారా ..?

Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన చిన్నది జాన్వీ కపూర్.  బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని తెలుగు తెరకు దేవర సినిమాతో పరిచయమైంది. మొదటి సినిమాతోనే జాన్వీ తన అందంతో తెలుగువారిని కట్టిపడేసింది. సినిమాలో అమ్మడికి ఆశించినంత గుర్తింపు రాకపోయినప్పటికీ జాన్వీని మాత్రం ఏ ఒక్క తెలుగు ప్రేక్షకుడు మర్చిపోలేదు అని అంటే అతిశయోక్తి కాదు.


ఇక ఈ సినిమా తర్వాత జాన్వీ.. బాలీవుడ్ కు చెక్కేస్తుంది అనుకున్నారు. కానీ, అమ్మడు మాత్రం పెద్ది సినిమాలో ఛాన్స్ పట్టేసింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్ర పెద్ది.ఈ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కాకుండా బాలీవుడ్ లో జాన్వీ కపూర్ నటిస్తున్న చిత్రం పరమ్ సుందరి. సిద్ధార్థ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తుషార్ జలోటా  దర్శకత్వం వహిస్తున్నాడు.

 


ఇప్పటికే పరమ్ సుందరి చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా  ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్  ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు .ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మొదటి సాంగ్ ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది.

 

ఇక తాజాగా ఈ సినిమాలోని మరో రొమాంటిక్ సాంగ్ అయిన భీగీ సారీ అంటూ సాగే గీతాన్ని రిలీజ్ చేశారు. రెయిన్ సాంగ్ గా తెరకెక్కిన ఈ సినిమా  ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆమితాబ్ భట్టాచార్య అందించిన లిరిక్స్ ని ఇంకా అద్భుతంగా పాడి ఆలపించారు సింగర్స్ శ్రేయా ఘోషల్, అద్నాన్ సమీ & సచిన్-జిగర్. ఇక రెయిన్ లో జాన్వీ అందాలు ఆరబోత నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. వైట్ కలర్ చీరలో తడి అందాలను ఆరబోస్తూ దేవకన్యలా కనిపించింది జాన్వీ. ఇక సిద్దార్థ్ – జాన్వీల మధ్య రొమాన్స్ అయితే థియేటర్ లో సెగలు పుట్టించడం ఖాయం అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో జాన్వీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

Related News

HBD Mahesh Babu: తెలుగులో ఆ ఘనత అందుకున్న ఏకైక హీరో!

Prabhas : సైలెంట్ గా పని కానిచ్చేసిన డార్లింగ్.. ‘ఫౌజీ ‘ కోసం పక్కా ప్లాన్..

Raksha Bandhan 2025: రాఖీ స్పెషల్.. టాలీవుడ్ లో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు..

Kaantha: దుల్కర్- భాగ్యశ్రీ కెమిస్ట్రీ చూశారా.. ఇదేదో బాగా వర్క్ అవుట్ అయ్యేలానే ఉందే

Couple Friendly : అమ్మ బాబోయ్ ఆ కిస్సులు ఏంటన్నా, సంతోష్ శోభన్ రూట్ మార్చాడు భయ్యా

Big Stories

×