BigTV English

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Sravanthi Chokkarapu: స్రవంతి చొక్కారపు (Sravanthi Chokkarapu)పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల కాలంలో ఏ సినిమా ఈవెంట్లు చూసిన స్రవంతి యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు. కెరియర్ మొదట్లో యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా పనిచేస్తున్న ఈమె ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఫేమస్ అయ్యారు. ఇలా యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా కొనసాగుతున్న స్రవంతికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈమెకు బిగ్ బాస్ (Big Boss)అవకాశం వచ్చింది. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కొన్ని వారాల పాటు కొనసాగి మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న స్రవంతి ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు.


గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్రవంతి..

ఇటీవల కాలంలో స్టార్ యాంకర్లకు పోటీగా వరుస సినిమా ఈవెంట్లతో సందడి చేస్తూ ఉన్నారు. ఇకపోతే బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్న ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన హాట్, గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సోషల్ మీడియాని కూడా షేక్ చేస్తుంటారు. పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ ఈమె మాత్రం భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంటారు. ట్రెండీ వేర్ లో మాత్రమే కాకుండా ట్రెడిషనల్ లుక్ లో కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు.


ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చిన స్రవంతి…

ఇకపోతే ఇటీవల ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా నారింజరంగు లంగా వోని వేసుకొని మెడ నిండా నగలతో సాంప్రదాయం ఉట్టిపడేలా తయారయ్యి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో ఈమె అవుట్ ఫిట్ చూస్తే మాత్రం అక్కినేని కోడలిని అనుసరించారని తెలుస్తోంది. లేత నారింజరంగు లంగా ఓని ధరించిన ఈమె అక్కినేని కోడలు శోభితను(Sobhitha) నిశ్చితార్థపు డ్రస్సును రిక్రియేట్ చేశారని తెలుస్తోంది. శోభిత ధూళిపాళ్ల కూడా తన నిశ్చితార్థంలో అచ్చం ఇలాంటి లంగా వోని ధరించడం విశేషం.

శోభితను ఫాలో అయ్యారా?

ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు చూడముచ్చటగా ఉన్నావు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు శోభితను చూసి ఇన్స్పైర్ అయ్యారా? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కెరియర్ పరంగా యాంకర్ గా, నటిగా స్రవంతి ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక శోభిత విషయానికి వస్తే నటిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అక్కినేని నాగచైతన్య (Nagachaitanya)ను ప్రేమించి గత ఏడాది డిసెంబర్లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య సమంత నుంచి విడిపోయిన తర్వాత ఈమె తనని వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా శోభిత వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా గడుపుతున్నారు.

Also Read: Danush -Mrunal: ధనుష్, మృణాల్ ఠాకూర్ రిలేషన్ నిజమేనా…అలా హింట్ ఇచ్చిన నటి!

Related News

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×