Big Tv Vare wah: ఇప్పటికే ఎన్నో బుల్లితెర కార్యక్రమాలు ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి. ఇలా బుల్లితెరపై మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా సరికొత్త కార్యక్రమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ టీవీ (Big Tv)ఇప్పటికే కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ వర్ష (Varsha)యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో బిగ్ టీవీ మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బిగ్ టీవీ స్టూడియోస్ లో ” వారెవ్వా క్యా షో హై”అనే పేరుతో సరికొత్త కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.
వారెవ్వా క్యా షో హై…
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి బుల్లితెర నటి శోభా శెట్టి(Sobha Shetty) యాంకర్ గా కొనసాగుతున్నారు. ఈమెతో పాటు యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజ (Tasty Teja)కూడా యాంకర్ గా వ్యవహరించబోతున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా ఈ ఇద్దరు కాలేజి స్టూడెంట్స్ తో కలిసి సరదాగా ఆటపాటలతో అందరిని సందడి చేశారు. ఇలా ఈ ప్రోగ్రాం చూస్తుంటే ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించబోతుందని తెలుస్తోంది.
యాంకర్లుగా టేస్టీ తేజ, శోభా శెట్టి…
ఇక ఈ కార్యక్రమం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఎప్పుడు ప్రసారమవుతుంది ఏంటి అనే విషయాల గురించి త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఇక శోభా శెట్టి బుల్లితెర నటిగా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే .ఇందులో విలన్ పాత్రలో నటించిన శోభా శెట్టి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం అందుకున్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత ఎలాంటి కార్యక్రమాలకు కమిట్ అవ్వకపోయినా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తే ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక తాజాగా ఈమె వారెవ్వా (Vare wah) కార్యక్రమంలో యాంకర్ గా సందడి చేయబోతున్నారు.
ఇక టేస్టీ తేజ కూడా యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్న తేజ ఈ కార్యక్రమాల ద్వారా మరింత గుర్తింపు పొందడమే కాకుండా పెద్ద ఎత్తున సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ విపరీతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ తర్వాత ఏదైనా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే చాలు కచ్చితంగా చిత్ర బృందం టేస్టీ తేజతో ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నారు. అలాగే పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా తేజ సందడి చేస్తున్నారు. మరి శోభా శెట్టి, టేస్టీ తేజ కాంబోలో రాబోతున్న ఈ కార్యక్రమం కచ్చితంగా ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందించబోతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Also Read: Katrina Kaif: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన కత్రినా… ముగ్గురం కాబోతున్నామంటూ?