E-Paper
Advertisement

Marthanda K Venkatesh: బయ్యర్స్ కు సినిమా వేస్తే అందరూ పడుకున్నారు, కట్ చేస్తే ఆ సినిమా కల్ట్ క్లాసిక్ అయింది

Marthanda K Venkatesh: బయ్యర్స్ కు సినిమా వేస్తే అందరూ పడుకున్నారు, కట్ చేస్తే ఆ సినిమా కల్ట్ క్లాసిక్ అయింది
Advertisement

Marthanda K Venkatesh:  ఒక సినిమా సక్సెస్ ను ఎవరు అంత ఈజీగా గెస్ చేయలేరు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ని వసూలు చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆడియన్స్ కి ఎటువంటి సినిమాలు నచ్చుతాయి అని ఎవరు గెస్ చేయలేరు. ఒకవేళ అది గెస్ చేయగలిగితే ఖచ్చితంగా అందరు దర్శకులు హిట్ సినిమాలు మాత్రమే తీస్తారు. ఒక దర్శకుడికి ప్రేక్షకుడి నాడి తెలియాలి అంటారు, ఇక ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్ లో అలా తెలిసింది ఎస్ఎస్ రాజమౌళికి మాత్రమే అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజమౌళి సినిమాలు 100% సక్సెస్ రేట్.

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అని చెప్పొచ్చు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ వరుసగా 7 హిట్ సినిమాలు చేశాడు. మొదట్లో పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందరికీ విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పటికీ కూడా ఆ క్రేజ్ ఉంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలను విపరీతంగా చూసినవాళ్లే. పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమా చేసిన కూడా దానిలో తనదైన శైలిని జోడించి అభిమానులకు మంచి కిక్ ఇచ్చేవాడు. అలాంటి సినిమాల్లో ఖుషి కూడా ఒకటి అని చెప్పాలి.

Advertisement

పవన్ కళ్యాణ్ కెరియర్ లో చేసిన కొన్ని సినిమాలకి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కరుణాకర్ దర్శకుడిగా పరిచయమైన తొలిప్రేమ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫిలిమ్స్ లో ఆ సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. ఆ సినిమా కథను పవన్ కళ్యాణ్ నమ్మి ఓకే చేశాడు. కరుణాకర్ కూడా ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమాలో ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లా కనిపిస్తాడు. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కంటే ముందు కొంతమంది బయ్యర్లకి సినిమాను చూపించారట. అయితే చాలామంది బయ్యర్లు ఈ సినిమాను చూసి నిద్రపోయారట. ఒక బయ్యర్ వచ్చి ఏంటి మీకు ఆడవాళ్లు అంటే ఇష్టం లేదా అని అడిగారట. ఎందుకు అని తిరిగి ప్రశ్నిస్తే సినిమాలో హీరోయిన్ అంత అందంగా చూపించారు. కానీ పాటల్లో ఒక ఫిమేల్ వాయిస్ కూడా లేదని చెప్పారట. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా మార్తాండకే వెంకటేష్(Marthanda K Venkatesh) రీవిల్ చేసారు.

Tholi Prema

Advertisement

ఇకపోతే కరుణాకర్ సినిమాల్లో ప్రత్యేకత ఏమిటంటే హీరోయిన్ ని చాలా అందంగా చూపిస్తాడు. తొలిప్రేమ సినిమాలో కీర్తి ను చూపించిన విధానం కరుణాకర్ కెరియర్ లో ఆల్ టైం బెస్ట్ అని చెప్పాలి. ఆ సీన్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏదేమైనా బయ్యర్స్ ఒపీనియన్ కి సినిమా రిజల్ట్ కి కంప్లీట్ తేడా ఉంది. అయితే ఆడియన్స్ కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అని పవన్ కళ్యాణ్ జడ్జ్ చేయటం అనేది మంచి ఎచీవ్మెంట్.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×