E-Paper
Advertisement

Matka Movie Teaser: మెగా హీరో హిట్ కొట్టినట్టేనా.. టీజర్ తోనే హైప్ ..!

Matka Movie Teaser: మెగా హీరో హిట్ కొట్టినట్టేనా.. టీజర్ తోనే హైప్ ..!
Advertisement

Matka Movie Teaser.. మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) జయప్రజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కనీసం ఒక్క హిట్ అయినా కొట్టాలని, తన అన్న రామ్ చరణ్ అంతా రేంజిలో కాకపోయినా కనీసం టైర్ -2 హీరోగా అయినా సెటిల్ అవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటూ.. ఆ క్షణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ రేంజ్ లో ఒక్క హిట్ కూడా వరుణ్ తేజ్ కు పడలేదని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ లభించడం లేదు.

మట్కా టీజర్ రిలీజ్..

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం మట్కా (Matka )…ప్రముఖ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. ఈ సినిమాలో సలోని, నవీన్ చంద్ర, నోరా ఫతేహి తదితరులు కీలకపాత్రల పోషిస్తున్నారు. 1960 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో వస్తున్న ఈ చిత్రం నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టగా.. అందులో భాగంగానే నేడు ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

టీజర్ తోనే హైప్..

Advertisement

టీజర్ విషయానికి వస్తే.. ఈ దేశంలో చలామణి అయ్యే ప్రతి రూపాయలో 90 పైసలు నూటికి ఒక్కడే సంపాదిస్తున్నాడు. మిగతా పది పైసల గురించి మిగిలిన 99 మంది కూడా కొట్టుకుంటున్నారు.. అనే డైలాగ్ తో టీజర్ చాలా అద్భుతంగా ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ డైలాగ్స్ లో మంచి వర్త్ ఉందని కూడా ఆడియన్స్ కూడా చెబుతున్నారు. దీనికి తోడు టీజర్ లో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగులు కూడా అదుర్స్ అనిపిస్తున్నాయి. ఫైట్స్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది అనే వార్తలైతే స్పష్టంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

వరుణ్ తేజ్ కి కలిసొచ్చేనా..

ఇకపోతే వరుణ్ తేజ్ కి ఈ సినిమా అత్యంత ప్రెస్టేజియస్ మూవీ అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే లావణ్య ,వరుణ్ తేజ్ కి కలిసొచ్చినట్టే అంటూ కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×