E-Paper
Advertisement

Meera Jasmine: మీరా జాస్మిన్ రీ ఎంట్రీ.. ఫొటో వైర‌ల్‌

Meera Jasmine: మీరా జాస్మిన్ రీ ఎంట్రీ.. ఫొటో వైర‌ల్‌
Advertisement

Meera Jasmine:మ‌ల‌యాళ న‌టి మీరా జాస్మిన్ దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్ర ఇస్తుందా! అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. అందుకు స‌మాధానంగా ఆమె డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో ఉన్న ఫొటో వైర‌ల్ అవుతుంది. ఈ ఫొటోను ఆమె త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పాటు బ్యాక్ టు వ‌ర్క్ అంటూ క్యాప్ష‌న్ కూడా జ‌త చేసింది. మ‌రి ఆమె ఇంత‌కీ ఏ సినిమాలో న‌టించింద‌నే సంగ‌తి మాత్రం చెప్ప‌లేదు. 2013.. మోక్ష అనే తెలుగు సినిమాలో న‌టించిన త‌ర్వాత మీరా జాస్మిన్ మ‌రో తెలుగు సినిమాలో యాక్ట్ చేయ‌లేదు.

2004లో అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన మీరా జాస్మిన్ త‌ర్వాత ర‌వితేజ భ‌ద్ర చిత్రంలోనూ నటించి మెప్పించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘గుడుంబా శంకర్’… బాలకృష్ణ ‘మహారథి’ సినిమాల్లో నటించింది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే అనిల్ అనే బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైంది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌టంతో అత‌ని నుంచి నాలుగేళ్ల‌కే విడిపోయింది. మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాల‌నుకున్న ఆమె ఫిజిక్ మీద దృష్టి పెట్టి స‌న్న‌బ‌డింది. ఎట్ట‌కేల‌కు రీ ఎంట్రీ ఇచ్చింది. మ‌రీ కొత్త ఇన్సింగ్స్‌లో ఎలా రాణిస్తుందో చూడాలిక‌.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×