E-Paper
Advertisement

Chiranjeevi: కల్కి హిట్.. అభినందనలు తెలిపిన మెగాస్టార్

Chiranjeevi: కల్కి హిట్.. అభినందనలు తెలిపిన మెగాస్టార్
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ బాగుకోరే వ్యక్తుల్లో చిరు మొదటిస్థానంలో ఉంటాడు.ఏ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చినా ఆ చిత్ర బృందాన్ని అభినందించడంలో ఏవిధంగా కూడా మొహమాటపడడు. ఇక ఏపీ ప్రభుత్వం మారాక.. మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కల్కి2898AD.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎలాంటి నెగెటివ్ టాక్ లేకుండా అన్నిచోట్లా హిట్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ యాడ్ చేసి నాగ్ అశ్విన్.. ఒక కొత్త ప్రయోగం చేశాడు. ఇక ఉదయం నుంచి కల్కి గురించే సోషల్ మీడియాలో చర్చ. కర్ణుడుగా ప్రభాస్.. అర్జునుడుగా విజయ్ దేవరకొండ కనిపించి.. సెకండ్ పార్ట్ పై మరింత హైప్ పెంచేశారు.

Advertisement

ఇక అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం కల్కి విజయానికి అభినందనలు తెలుపుతున్నారు. నాగీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం కల్కి2898AD పై ప్రశంసలు కురిపించాడు. ఇంత మంచి హిట్ ను ఇండస్ట్రీకి అందించినందుకు నాగీకి అభినందనలు తెలిపాడు.

” కల్కి2898AD గురించి అద్భుతమైన రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ వంటి స్టార్ తారాగణంతో ఇటువంటి అద్భుతమైన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఫ్యూచర్ సినిమాను తెరకెక్కించిన నాగ్ అశ్విన్ సృజనాత్మకతకి కుడోస్ చెప్తున్నాను. ఇంతటి ఘనతను సాధించిన నా అభిమాన నిర్మాత అశ్విన్ దత్ గారు, ప్యాషనేట్ మరియు కరేజియస్ స్వప్న దత్, ప్రియాంక దత్ మరియు టీమ్ మొత్తానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. కలలు కనండి.. భారతదేశ జెండాను మరింత ఎత్తుకు ఎగరేయండి” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×