BigTV English

  Meher Ramesh : మెహెర్ అన్నా..నువ్వే మా ఆశా కిరణం.. మోత మోగిస్తున్న మీమర్స్…

  Meher Ramesh : మెహెర్ అన్నా..నువ్వే మా ఆశా కిరణం.. మోత మోగిస్తున్న మీమర్స్…
Meher Ramesh latest news

Meher Ramesh latest news(Telugu cinema news):

ఈరోజు ఇండియా ప్రపంచ కప్ ఫైనల్స్ లో పాల్గొంటున్న సందర్భంగా సోషల్ మీడియా పలు రకాల వీడియోస్ తో నిండిపోయింది. చాలా క్రియేటివ్ గా ఎడిట్ చేసిన ఈ వీడియోస్.. ఇంటర్నెట్ ని ఒక ఊపు ఊపుతున్నాయి. ఎడిటింగ్ లో సిద్ధహస్తులైన తెలుగు నేటిజన్స్.. తమ క్రియేటివిటీ పీక్స్ ప్రదర్శిస్తూ పలు రకాల మిమ్స్ క్రియేట్ చేశారు. తెలుగు పిక్చర్ లో ఉన్న అనేక సందర్భాలు సన్నివేశాలు ఉపయోగించి క్రేజీ మిమ్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.


అయితే మిగిలిన మిమ్స్ అన్నీ ఒకపక్క అయితే.. పాపం మెహర్ రమేష్ మీద చేసిన మీన్స్ మాత్రం మరొక పక్క అన్నట్టు ఉంది పరిస్థితి. మెహర్ రమేష్ డిజాస్టర్ మూవీ తీసిన ప్రతిసారి ఇండియా ట్రోఫీ గెలుస్తుంది అన్న సెంటిమెంట్ ని మరొకసారి ఈ సందర్భంగా నేటిజెన్లు తెరమీదకు తీసుకోవచ్చారు. మెహర్ రమేష్ తీసే డిజాస్టర్ మూవీస్ కి ఎంత పాపులర్ అయ్యాడు ఇప్పుడు ఈ మిమ్స్ కి కూడా అంతకంటే పాపులర్ అయ్యాడు.

భయపడకండి మెహర్ అన్న కప్పు కచ్చితంగా గెలుస్తాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు సంగతేమిటంటే 2011లో మెహర్ రమేష్ జూనియర్ ఎన్టీఆర్ తో శక్తి మూవీ చేశాడు. అది ఏ రేంజ్ డిజాస్టర్ అందరికీ తెలుసు.. అదే సంవత్సరం ధోని నాయకత్వంలో ఇండియన్ టీం వన్డే ప్రపంచ కప్ ను సాధించింది. మళ్లీ తిరిగి 2013లో మెహర్ రమేష్ వెంకటేష్ తో షాడో అనే మూవీ చేసి పెద్ద డిజాస్టర్ మూట కట్టుకున్నాడు. మళ్లీ తిరిగి అదే సంవత్సరం భారత్ జట్టు ఛాంపియన్ ట్రోఫీలో విన్నర్ గా నిలిచింది.


ఇక తర్వాత 10 సంవత్సరాల పాటు మెహర్ రమేష్ సినిమాల జోలికే పోలేదు. ఈ టైంలో ఇండియా కూడా ఎటువంటి ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. ఇక ఈ సంవత్సరం మెగాస్టార్ తో ‘భోళా శంకర్’ అనే పెద్ద డిజాస్టర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు మెహర్ రమేష్. ఇన్నాళ్ల తర్వాత మెహర్ తన డిజాస్టర్ మూవీ తో రీఎంట్రీ ఇవ్వడం.. ఇదే సంవత్సరం మనకు ప్రపంచకప్ కూడా ఉండడం యాదృచ్ఛికమైతే కాదు కదా. ఈ కో ఇన్సిడెన్స్ ఇండియా ఖాతాలో కప్ తేవడానికి అంటున్నారు నెటిజన్లు. ఒకవేళ అందరూ అంటున్నట్టు ఇండియా కప్ గెలిస్తే మాత్రం మెహర్ రమేష్ మీమ్స్ తో సోషియల్ మీడియా మోతెక్కిపోతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×