E-Paper
Advertisement

Mrunal Thakur: ఆ సినిమా కోసం మరీ అంతగా దిగజారాలా.. మృణాళ్?

Mrunal Thakur: ఆ సినిమా కోసం మరీ అంతగా దిగజారాలా.. మృణాళ్?
Advertisement

Mrunal Thakur upcoming movie update(Cinema news in telugu): పీరియాడిక్ మవీ సీతారామంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మృణాళ్ ఠాకూర్. హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ మూవీస్ తో సంప్రదాయ సుద్ధపూసిని గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. మృణాళ్ ను తెలుగు ప్రేక్షకులు ఫ్యామిలీ టైప్ హీరోయిన్ గానే చూస్తున్నారు తప్ప గ్లామర్ డాల్ గా మాత్రం ఒప్పుకోవడం లేదు. హీరోతో సమాన నిడివి ఉన్న పాత్రలే ఆమెను వరిస్తున్నాయి. సీతారామం మూవీలో ఏకంగా హీరోనే డామినేట్ చేసే పాత్ర పోషించింది. అలాగే హాయ్ నాన్న మూవీలోనూ తన కళ్ల ముందే ఉన్న భర్త, కొడుకును మర్చిపోయి వాళ్లతో స్నేహం చేసే క్యారెక్టర్ లో గొప్పగా నటించింది. ఇక ఫ్యామిలీ స్టార్ మూవీలో వ్యక్తిత్వం ఉన్న ఆడపిల్లగా విజయ్ దేవరకొండతో కలిసి నటించి అక్కడా మంచి మార్కులే కొట్టేసింది. కల్కి మూవీలో ఓ క్యామియో రూల్ చేసింది.

అన్నీ ఫ్యామిలీ పాత్రలే..

Advertisement

ప్రస్తుతం మృణాళ్ కు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్టులే వస్తున్నాయి. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ పేరున్న హీరోతో ఈమె లవ్ లో పడిందనే టాక్ వినిపిస్తోంది. అయితే మృణాళ్ ఈ విషయంలో ఏ రకంగానూ స్పందించడం లేదు. సినిమాల పరంగా ఆచితూచి అడుగులేస్తున్న మృణాళ్ ఓ సినిమా విషయంలో నిర్మాతను అడుక్కోవాల్సి న పరిస్థితి వచ్చిందని అంటోంది. రెండేళ్ల క్రితం తాను నటించిన పూజా మేరీ జాన్ మూవీ తీవ్ర జాప్యం జరిగి ఎప్పుడో విడుదల కావలసిఉంది. సీతారామం మూవీ ఫినిష్ చేసిన వెంటనే పూజా మేరీ జాన్ మూవీకి కమిట్ అయ్యానని..ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ కు నోచుకోలేదని వాపోతోంది. ఆ మూవీలో తన క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందట. సినిమాకు సంబంధించిన పనులు అన్నీ కూడా పూర్తయ్యాయి. అయినా ఆ మూవీకి బిజినెస్ అవ్వలేదనే సాకుతో సదరు నిర్మాత తీవ్ర జాప్యం చేస్తున్నాడని ..నిర్మాతను కలిసినప్పుడల్లా సినిమాను తొందరగా రిలీజ్ చేయమని ప్రాధేయపడుతున్నానని అంటున్నారు మృణాళ్.

మూవీని రిలీజ్ చెయ్యించాలని డిమాండ్

Advertisement

ఈ మూవీ రిలీజ్ అయితే తనకు మంచి పేరు వస్తుందని చెబుతోంది అమ్మడు. మృణాళ్ కు ఉన్న కాన్ఫిడెన్ష్ పూజా మేరీ జాన్ నిర్మాతకు ఎందుకు లేదని నెటిజన్లు నిర్మాతపై మండిపడుతున్నారు. పూజా మేరీ జాన్ కోసం మృణాళ్ ప్రాణం పెట్టి ఆ పాత్ర చేశానంటోంది. అయినా నిర్మాత ఎందుకంత కమర్షియల్గా ఆలోచిస్తున్నాడు అని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో మృణాళ్ కు మద్దతు ఇచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. నిర్మాతపైనా బాగా ఒత్తిడి వస్తోంది. అయితే మృణాళ్ ఈ రకంగా నిర్మాతకు ఓ మంచి పేరే తెచ్చిపెట్టందని చెప్పవచ్చు. నిన్నమొన్నటిదాకా బిజినెస్ అవ్వని పూజా మేరీ జాన్ మూవీకి మృణాళ్ దెబ్బకి ఒక్కసారిగా ఎంక్వయిరీ మొదలుపెట్టారట బయ్యర్లు. ఇప్పుడా నిర్మాత మృణాళ్ చేసిన పనికి ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. మనసులోనే మృణాళ్ కు దండాలు పెట్టుకుంటున్నాడు. మూలన పడివున్న సినిమాకు మళ్లీ ప్రాణం పోసింది మృణాళ్.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×