BigTV English

Mrunal thakur: అతడిని పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్..!

Mrunal thakur: అతడిని పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్..!

Mrunal thakur.. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి బాలీవుడ్ లో పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal thakur)ఎక్కువగా హిందీ సీరియల్స్ లో నటించి మరింత పేరు సొంతం చేసుకుంది. సినిమాల్లోకి రాకముందే సీరియల్స్ ద్వారా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ , తన అద్భుతమైన నటనతో, గ్లామర్ తో అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది. ఆ క్రేజ్ ఈమెకు తెలుగులో నేరుగా నటించే అవకాశాన్ని అందించింది.


ప్రిన్సెస్ నూర్జహాన్ గా మెప్పించిన మృణాల్..

అలా మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer salmaan) తొలిసారి తెలుగులో నేరుగా నటించిన చిత్రం సీతారామం (Sitaramam). హను రాఘవపూడి (Hanu raghavapudi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ద్వారా మృణాల్ ఠాకూర్ తొలిసారి తెలుగుతెరకు పరిచయం అయింది. ఇందులో తన నటన గురించి , అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ప్రిన్సెస్ నూర్జహాన్ క్యారెక్టర్ లో అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి.


వరుస ఫ్లాపులతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మృణాల్..

అలా తన వరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందుకుంటూ దూసుకుపోతోంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు అందుకున్న ఈమె ఈమధ్య ఫ్లాప్ లు ఎక్కువగా చవిచూస్తోందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయినా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. అందులో భాగంగానే తాజాగా లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తోందని చెప్పవచ్చు.

ఆగలేకపోతున్నా అంటూ ఒక వ్యక్తిని పరిచయం చేసిన మృణాల్..

Mrunal thakur: Mrunal who introduced him.. Can't stop posting..!
Mrunal thakur: Mrunal who introduced him.. Can’t stop posting..!

ఇదిలా ఉండగా తాజాగా ఒక వ్యక్తితో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..” హ్యాపీ బర్తడే అమేజింగ్ పర్సన్..చెన్నైలో రేపు కలుద్దాము.. నీ పుట్టిన రోజున జరపడానికి నేను ఆగలేకపోతున్నాను” అంటూ రాసుకు వచ్చింది .దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అంటూ అభిమానులు సైతం ఆరా తీయడం మొదలుపెట్టారు. మరి మృణాల్ కి , ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి మధ్య సంబంధం ఏంటో తెలియదు కానీ ఈ ఫోటో మాత్రం ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది.

మృణాల్ కెరియర్..

ఇక మృణాల్ విషయానికి వస్తే.. సీతారామం సినిమా తర్వాత నాని సరసన హాయ్ నాన్న చిత్రంలో నటించిన ఈమె.. ఈ సినిమాతో ఏకంగా ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకుంది. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటించింది కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ప్రస్తుతం అన్ని కూడా డిజాస్టర్ గా మిగులుతున్న నేపథ్యంలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం కథలు వింటున్న మృణాల్ ఠాకూర్ అద్భుతమైన కథతో గట్టి కం బ్యాక్ ఇవ్వాలని ఎదురుచూస్తోంది. మరి దర్శకులు ఈమెకు ఎలాంటి పాత్రను ఆఫర్ చేస్తారో చూడాలి.

 

View this post on Instagram

 

Related News

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Big Stories

×