BigTV English

Naa Saami Ranga : నా సామి రంగాలో అంజి నిచూశారా.. చూసేయండి లేకపోతే మాటొచ్చేత్తది..

Naa Saami Ranga : నా సామి రంగాలో అంజి నిచూశారా.. చూసేయండి లేకపోతే మాటొచ్చేత్తది..

Naa Saami Ranga : ఈసారి సంక్రాంతికి నా సామి రంగ అంటూ మంచి మూవీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాడు కింగ్ నాగార్జున. నెల ముందర నుంచే చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ బాట పట్టింది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేయడమే కాకుండా వాళ్లకు సంబంధించిన గ్లింప్స్ ని కూడా విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అంజిగా ఈ మూవీలో అల్లరి నరేష్ క్యారెక్టర్ ని.. ఎలివేట్ చేస్తూ పోస్టర్ని కూడా విడుదల చేశారు.


పక్క పల్లెటూరు నేపథ్యంలో అమాయకం, చలాకీ తనం కలబోసిన కుర్రాడిగా అల్లరి నరేష్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు అతని పాత్రకు సంబంధించి.. ఓ గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఇక ఇందులో మునిపెన్నడూ చూడని రకంగా మాస్ స్టెప్పులు వేస్తూ.. అల్లరి నరేష్ మాటొచ్చేస్తది.. అనే డైలాగ్ తో అదరగొట్టాడు. ఈ చిన్ని గ్లింప్స్ తో ఈ సినిమాలో నాగార్జునకు అంజి పాత్రకు మధ్య ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ బాండింగ్ ఎలాంటిదో చూపించారు.

అల్లరి పాత్రలు చేయడానికి మంచి కామెడీ టైమింగ్ తో బాగా పేరుపొందిన.. అల్లరి నరేష్ ఆ ఇమేజ్ చట్రంలో నుంచి బయటపడడానికి చాలా కాలం పట్టింది. శంభో శివ శంభో ,నాంది ,ఉగ్రం లాంటి సినిమాలతో అతను భారీ సీరియస్ పాత్రలను కూడా అద్భుతంగా హ్యాండిల్ చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ చిత్రంతో తిరిగి ఒకప్పటి అల్లరి నరేష్ అల్లరిని ..వినోదాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి డైరెక్టర్ ప్రయత్నించినట్టు అర్థమవుతుంది.


కింగ్ నాగార్జున.. కథానాయకుడిగా భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ మూవీకి ప్రముఖ నృత్య దర్శకుడు  విజయ్ బిన్ని దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఈరోజు అల్లరి నరేష్ పాత్రకు సంబంధించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఓ గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు. మా అంజి గారిని పరిచయం చేస్తున్నాం.. లేకపోతే 

మాటొచ్చేత్తది.. అంటూ నరేష్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ మూవీలో ‘మాటొచ్చేత్తది’ అనేది అంజి సిగ్నేచర్ డైలాగ్ అన్న విషయం అర్థమవుతుంది. మళ్లీ తిరిగి ఈ మూవీతో నరేష్ కామెడీ స్టైల్ పూర్తిస్థాయిలో మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×