BigTV English
Advertisement

Naga Chaitanya: N కన్వెన్షన్ కూల్చివేత.. చైతన్య ఏంటి అలా అనేశాడు

Naga Chaitanya: N కన్వెన్షన్ కూల్చివేత..  చైతన్య ఏంటి అలా అనేశాడు

Naga Chaitanya: అక్కినేని నాగార్జున N కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసిన విషయం తెల్సిందే. ఇక దీంతో గత కొన్నిరోజులుగా  నాగార్జున పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ కూల్చివేతపై ఇప్పటికే నాగార్జున స్పందించిన విషయం తెల్సిందే. అక్రమంగా తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి N కన్వెన్షన్ ను కట్టినట్లు వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని, ఆ భూమి అంతా పట్టా భూమి అని చెప్పుకొచ్చాడు.


” N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని Special Court, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం , నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పు కి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను ” అంటూ నాగ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

ఇక ఈ ఘటన తరువాత అసలు నాగ్ ఆస్తుల విలువ ఎంత.. ? N కన్వెన్షన్  ద్వారా నాగ్ వచ్చే ఆదాయం ఎంత.. ? అని ఆరాలు తీయడం మొదలుపెడుతున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా  నాగ చైతన్య  సైతం ఈ ఘటనపై స్పందించాడు. నిన్న  ఒక క్లాత్ షోరూమ్ ఓపెనింగ్ కు వెళ్లిన చైకు N కన్వెన్షన్ కూల్చివేతపై ప్రశ్న  ఎదురయ్యింది.


ఇక దానికి చై మాట్లాడుతూ.. ” ఈ సమయంలో దాని గురించి ఎందుకు.. అయినా దానికి సంబంధించిన నిజాలను నాన్న ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇంతకు మించి ఇక్కడ ఆ టాపిక్ మాట్లాడడం బాగోదని” చై చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.  మరి నాగ్.. N  కన్వెన్షన్ గురించి ఎలాంటి నిర్ణయం  తీసుకుంటాడో  వేచి చూడాల్సిందే.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×