E-Paper
Advertisement

Bujji Review by Naga Chaitanya: ప్రభాస్ ‘బుజ్జి’పై నాగచైతన్య రైడ్.. షాక్ అయ్యానంటూ వీడియో రిలీజ్..!

Bujji Review by Naga Chaitanya: ప్రభాస్ ‘బుజ్జి’పై నాగచైతన్య రైడ్.. షాక్ అయ్యానంటూ వీడియో రిలీజ్..!
Advertisement

Akkineni Naga Chaitanya Drives Prabhas Bujji Car: ప్రభాస్ నటిస్తున్న అత్యంత మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఒకటి. ఈ మూవీ పైనే అందరి ఫోకస్. అదీగాక ఇటీవల ‘బుజ్జి’ అంటూ ఓ కారు కోసం ఈవెంట్‌ను నిర్వహించిన మేకర్స్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే తారా స్థాయి అంచనాలను క్రియేట్ చేసిన మూవీ యూనిట్ ఈ ఈవెంట్‌తో మరింత స్థాయికి తీసుకెళ్లారు.

ఈ కల్కి మూవీలో ప్రభాస్ యుద్ద సన్నివేశాల కోసం ఉపయోగించే ఓ భారీ కారును అత్యద్భుతంగా రూపొందించారు. ఆ కారుకు బుజ్జి అని పేరు పెట్టారు. అయితే దాన్ని ఇటీవల ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఆ కారు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రభాస్ కటౌట్‌కి తగ్గట్టుగా బుజ్జిని చాలా అద్భుతంగా, డిఫరెంట్ లుక్‌లో తయారు చేశారు.

Advertisement

అందులో ప్రభాస్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే మామూలుగా లేదు. రెబల్ స్టార్ ఎంట్రీ చూసి ప్రేక్షకులు, అభిమానులు పిచ్చెక్కిపోయారు. అయితే ఆ బుజ్జి ఆడియన్స్ దృష్టిని మాత్రమే కాదు.. సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ టాలీవుడ్ హీరో ప్రభాస్ బుజ్జిపై మనసు పారేసుకున్నాడు. ఆ బుజ్జితో ఎలాగైనా డ్రైవ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

Also Read: ప్రభాస్ ‘బుజ్జి’.. ఏందిరా ఈ బండి.. ఫీచర్లు, ధర చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు!

Advertisement

తన ఆనందాన్ని ఆపుకోలేక వెంటనే వెళ్లి బుజ్జిని కలిసాడు. అయితే ఆ హీరో మరెవరో కాదు.. అక్కినేని నాగ చైతన్య. అవునండీ నిజమే. నాగ చైతన్యకు కార్లంటే ఎంతో పిచ్చి. అందులోనూ స్పోర్ట్స్ కార్లంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. స్పోర్ట్స్ కార్లలో రేసింగ్ చేసే అనుభూతిని పొందుతూ ఉంటాడు. ఆ ఇష్టంతోనే అతడు హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ మోటార్ స్పోర్ట్ రేసింగ్ టీమ్‌కి ఓనర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.

మరి ఇంత పిచ్చి ఉన్నప్పుడు ఆగుతాడా..? వెంటనే వెళ్లి ప్రభాస్ బుజ్జిని కలిసాడు. బుజ్జిని కలిస్తే సరిపోతుందా? డ్రైవ్ చేసేంతవరకు వదలడు. మొత్తానికి బుజ్జిపై తన హ్యాండ్ వేసేశాడు. బుజ్జితో స్పీడ్ డ్రైవ్ చేస్తూ నాగ చైతన్య భలే థ్రిల్ అయ్యాడు. అయితే ఆ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఓ వీడియో రూపంలో తెలియజేశాడు. ఆ వెహికల్ తయారీని చూసి ఆశ్చర్యపోయాడు చైతు. ఈ మేరకు తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని.. ఇంజనీరింగ్‌కు సంబంధించిన అన్ని రూల్స్‌ను మీరు బ్రేక్ చేశారని బుజ్జిని రూపొందించిన టీంపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×