E-Paper
Advertisement

Namitha: విజయ్ తో పోటీ.. డిపాజిట్లు కూడా దక్కవు

Namitha: విజయ్ తో పోటీ.. డిపాజిట్లు కూడా దక్కవు
Advertisement

Namitha: సొంతం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నమిత. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు గుండెల్లో ముద్రవేసుకుని కూర్చున్న ఈ బ్యూటీ ఆ తరువాత బొద్దుగా మారి.. తమిళ తంబీల ఆరాధ్య దైవంగా మారింది. ఆమె అందానికి ఫిదా అయిన కొందరు ఆమెకి ఏకంగా గుడి కూడా కట్టారు. ఇలా నమితకు మాత్రమే చేయలేదు.. అంతకుముందు ఖుష్బూకు కూడా ఇలాగే గుడి కట్టారు.

ఇక ఇవన్నీ పక్కన పెడితే. తెలుగు,తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించిన నమిత 2017 లో వీరేంద్ర చౌదరిని వివాహమాడి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. గతేడాది ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇక సినిమాలకు దూరమైన నమిత రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసింది. మొదటి నుంచి కూడా ఆమె బీజేపీ తరుపున ప్రచారం చేస్తూ వస్తుంది.తాజాగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి ఎల్. మురుగన్ తరుపున ఆమె ప్రచారం చేస్తుంది.

Advertisement

ఇక ఈ నేపథ్యంలోనే నమిత మాట్లాడుతూ.. “2026 లో నేనే బీజేపీ తరుపున నిలబడతాను.కచ్చితంగా హీరో విజయ్ కు పోటీ ఇస్తా. రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థితో పోటీ చేస్తేనే ఎదుగుదల ఉంటుంది. విజయ్ కూడా రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక నమితను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. ఇకపోతే నమిత, విజయ్ పై పోటీ చేస్తాను అని చెప్పేసరికి విజయ్ యాంటీ ఫ్యాన్స్ విమర్శించడం మొదలుపెట్టారు. నమిత కనుక నిలబడితే.. విజయ్ కు డిపాజిట్లు కూడా గల్లంతే అని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×