E-Paper
Advertisement

Balakrishna Remunaration: బిగ్ బాస్ హౌస్‌లోకి బాల‌య్య‌.. వామ్మో అంత రెమ్యూన‌రేష‌నా!

Balakrishna Remunaration: బిగ్ బాస్ హౌస్‌లోకి బాల‌య్య‌.. వామ్మో అంత రెమ్యూన‌రేష‌నా!
Advertisement

Balakrishna Remunaration:తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది. నిర్వాహ‌కులు ఏడో సీజ‌న్‌ను స్టార్ట్ చేయాల‌ని అనుకుంటున్నారు. అయితే ఈసారి నిర్వాహ‌కుల‌కు హోస్ట్‌గా చేస్తూ వ‌చ్చిన నాగార్జున హ్యాండ్ ఇచ్చేశారు. ఆయ‌న ఏడో సీజ‌న్‌ను హోస్ట్ చేయ‌న‌ని చెప్పేశారని టాక్‌. దీంతో వారు మ‌రో హోస్ట్‌గా ఎవ‌రినీ తీసుకోవాలా? అని ఆలోచిస్తుండ‌గా వారి క‌న్ను నంద‌మూరి బాల‌కృష్ణ‌పై ప‌డింద‌ని అంటున్నారు.

అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే సీజ‌న్ 2 స‌క్సెస్‌ఫుల్‌గా జ‌రుగుతోంది. దేశంలోని టాక్ షోస్ అన్నింటిలో ఇదే నెంబ‌ర్ వ‌న్ ర్యాంకింగ్‌లో రాణిస్తుంది. బాల‌కృష్ణ‌ను స‌రికొత్త కోణంలో ఈ టాక్ షో ఆవిష్క‌రించింది. మ‌రో వైపు ఆయ‌న కూడా రొటీన్‌కు భిన్నంగా ఈ టాక్‌షోను నిర్వ‌హిస్తున్నారు. ఇలాంటి హోస్ట్‌ను బిగ్ బాస్‌లోకి తీసుకొస్తే రియాలిటీ షో దుమ్ము దుమారం అవుతుంద‌ని బిగ్ బాస్ యాజ‌మాన్యం భావిస్తుంది. అందుకోసం బాల‌య్య సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని టాక్‌. ఆయ‌న కూడా ఓకే అన్నార‌నే వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

అయితే బాల‌కృష్ణ‌ను ఈ రియాలిటీ షోలోకి హోస్ట్‌గా అడుగు పెట్టించ‌టానికి బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఏకంగా ఒక‌టి రెండు కాదు.. ప‌ది కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ను ఎన్టీఆర్‌, నాని, నాగార్జున హోస్ట్ చేశారు. వీరెవ్వరికీ ఇవ్వ‌నంతగా బిగ్ బాస్ 7 లో బాల‌కృష్ణ‌కు రెమ్యూన‌రేష‌న్ ఆఫ‌ర్ చేశార‌ట‌. వారానికి రెండు రోజుల హోస్టింగ్‌.. భారీ రెమ్యూన‌రేష‌న్ కావ‌టంతో బాల‌కృష్ణ కూడా ఓకే అన్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×