E-Paper
Advertisement

Nandamuri Mokshagna: నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌ ఎంట్రీ.. అఖండ 2 పై బాల‌య్య క్లారిటీ

Nandamuri Mokshagna: నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌ ఎంట్రీ.. అఖండ 2 పై బాల‌య్య క్లారిటీ

Nandamuri Mokshagna : న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ రానున్న సంక్రాంతికి వీర సింహా రెడ్డి చిత్రంతో థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌, సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు నంద‌మూరి ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న మ‌రో అంశం నంద‌మూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా? అని . మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి నెట్టింట చాలా వార్త‌లే వినిపిస్తున్నాయి. తాజాగా గోవా ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు వెళ్లి బాల‌య్య అక్క‌డ మీడియాతో మాట్లాడారు. ఆ సంద‌ర్భంలో మోక్ష‌జ్ఞ సినీ రంగ ప్ర‌వేశం గురించి క్లారిటీ ఇచ్చారు.

వ‌చ్చే ఏడాదిలో మోక్ష‌జ్ఞ సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నార‌ని బాల‌కృష్ణ తెలిపారు. అయితే దానికి ద‌ర్శ‌క‌త్వం ఎవ‌రు చేస్తార‌నేది ఆయ‌న చెప్ప‌లేదు. దేవుడు ఎలా నిర్ణ‌యిస్తే అలా జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో అఖండ సీక్వెల్ గురించి ప్ర‌శ్నిస్తే త‌ప్ప‌కుండా చేస్తామ‌ని.. స‌బ్ టైటిల్స్‌తో స‌హా లాక్ చేసి ఉంచాం. అయితే ఎప్పుడు చేయాల‌నేదే చూడాలి అని అన్నారు.

ప్రస్తుతం బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న వీర‌సింహా రెడ్డి షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కి చేరుకుంది. సంక్రాంతి బరిలోకి దిగుతుంది. దీని త‌ర్వాత అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా స్టార్ట్ చేస్తున్నారు బాల‌య్య‌. మ‌రో వైపు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కుడిగా రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నారు. వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం తాము చేస్తున్న సినిమాల‌ను కంప్లీట్ చేసుకున్న త‌ర్వాతే బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×