E-Paper
Advertisement

Naresh : పవిత్రతో త్వరలో పెళ్లి .. నరేశ్ క్లారిటీ..

Naresh : పవిత్రతో త్వరలో పెళ్లి .. నరేశ్ క్లారిటీ..
Advertisement

Naresh : సీనియర్ నటుడు నరేష్ , పవిత లోకేష్ ఈ జంట కొంతకాలంగా హాట్ టాపిక్ గా ఉన్నారు. వీరి బంధంపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. వీరు ఎక్కడికి వెళ్లినా జంటగా వెళుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటున్నారు. అలాగే ఎన్నో వివాదాలు వీరి చుట్టూ తిరుగుతున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. అయితే.. ఇప్పుడు వీరి బంధంపై నరేష్ కీలక ప్రకటన చేశారు.

తన స్నేహితురాలు, సహనటి పవిత్ర లోకేశ్‌ను త్వరలో వివాహం చేసుకోబోతున్నానని నటుడు నరేష్ వెల్లడించారు. దీనిపై శనివారం ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేశారు. “కొత్త సంవత్సరం, కొత్త ఆరంభాలు, మీ అందరి ఆశీస్సులు కావాలి. మేమిద్దరం త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాం’’ అని పేర్కొన్నారు. #PavitraNaresh అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఈ వీడియోకు జత చేశారు. ఇలా వీరి బంధంపై జరుగుతున్న చర్చకు పెళ్లి ప్రకటనతో నరేష్ తెరదించారు.

Advertisement

నరేశ్‌ కు గతంలో మూడు పెళ్లిళ్లు అయ్యాయి. కొంతకాలం నుంచి మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో నరేష్ ,పవిత్రా లోకేష్ పై ఆమె దాడికి ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ వివాదం పోలీసు కేసుల వరకు వెళ్లింది.

అటు పవిత్ర సైతం భర్తతో మనస్పర్థలు తలెత్తడంతో దూరంగా ఉంటారు. నరేష్ , పవిత్ర కలిసి పలు సినిమాల్లో నటించారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం సహజీవనానికి దారి తీసింది. ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు ఈ జంట సిద్ధమైంది. కొంతకాలంగా నరేశ్‌, పవిత్ర పెళ్లిపై అనేక వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నరేష్ తాజాగా చేసిన ప్రకటనతో వారి పెళ్లిపై పూర్తి క్లారిటీ వచ్చింది. మొత్తంమీద 2023లో నరేశ్‌, పవిత్ర జంట పెళ్లి చేసుకొని కొత్త కాపురం పెట్టబోతున్నారు. మూడో భార్య రమ్యతో విడాకుల వ్యవహారం పూర్తైన తర్వాతే నరేశ్‌.. పవిత్రను పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×