Vikram Gaikwad: ప్రముఖ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ (51) కన్నుమూశారు. మేకప్ ఆర్టిస్ట్ కాక పలు సినిమాల్లో నటుడిగాను ఆయన మెప్పించారు. 2013లో ఓ బెంగాలీ చిత్రానికి ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా ఈయన జాతీయ అవార్డుని గెలుచుకున్నారు. విక్రమ్ గైక్వాడ్ మేకప్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలకి పనిచేశారు. వాటిలో చెప్పుకోదగినవి ఉరి, ది సర్జికల్ స్ట్రైట్, బ్లాక్ మెయిల్, దంగల్, పీకే, సూపర్ 30, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ వంటివి ప్రముఖ చిత్రాలు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ మృతి
మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ మరాఠీ సినిమాల్లో ఎక్కువగా పని చేశారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ముంబైలోని దాదర్ లో శివాజీ పార్క్ స్మశాన వాటికలో విక్రమ్ గైక్వాడ్ అంతే క్రియలు జరగనున్నట్లు సమాచారం.ఇక ఆయన 51 ఏళ్ల వయసులో కన్నుమూశారు. తన తమ్ముడు ఆయన మరణానికి సంబంధించిన కారణాన్ని తెలిపారు. కొంతకాలంగా అయినా రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లుగా మూడు రోజుల క్రితం ఆయన హిరానందాని హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు, చికిత్స జరుగుతూ ఉండగా ఆయన మరణించినట్లు తెలిపారు.ఇక అయన కు డర్టీ పిక్చర్ మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది. పలు సినిమాలకు IIFA,FOI పురస్కారాలు పొందారు.విక్రమ్ గైక్వాడ్ మరణ వార్త తెలుసుకున్నసెలబ్రిటీస్, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సంతాపం తెలిపారు. ఆయన మరణం చాలా బాధాకరమైన విషయం అని భారతీయ సినిమా నాటక రంగానికి విక్రమ్ గైక్వాడ్ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని ఏక్ నాథ్ షిండే పేర్కొన్నారు. అయన లేని లోటును చిత్ర పరిశ్రమలో ఎవరు భర్తీ చేయలేరు అని అభిమానులు ఆయనను స్మరిస్తూ కన్నీటి వీడ్కోలు తెలుపుతున్నారు.
పాత్రలకు మేకప్ తోనే ప్రాణం పోస్తారు ..
విక్రమ్ గైక్వాడ్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ గా హిందీ మరాఠీ తమిళ తెలుగు బెంగాలీ చిత్రాలలో అనేక పాత్రలకు జీవం పోశారు. విక్రమ్ గైక్వాడ మూడుసార్లు ఉత్తమ మేకప్ పార్టిస్ట్ అవార్డును గెలుచుకున్నారు. 2010లో బెంగాలీ చిత్రానికి 2011లో మరాఠీ చిత్రం మరియు హిందీ చిత్రం ది డర్టీ పిక్చర్, 2014లో బెంగాలీ చిత్రం జాతిశ్వర్ కు అవార్డులను గెలుచుకున్నారు. అంతేకాక 2016లో తాను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రానికి IIFA ఉత్తమ మేకప్ అవార్డును పొందారు. చాలా సినిమాలలో ఆయన హీరో క్యారెక్టర్స్ కు ఆ పాత్రకి తగిన విధంగా మేకప్ చేయడం విక్రమ్ గైక్వాడా కే సాధ్యం. అంతేకాక ఆయన ఆ పాత్రలకు మేకప్ ద్వారా ప్రాణం పోస్తారని, ఎంతోమంది నుండి ప్రశంసలను అందుకున్నాడు. ఇక ఆయన తన మేకప్ తో తన నైపుణ్యంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయారు అంటూ అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు ఆయన సృష్టించిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ సజీవంగానే నిలిచి ఉంటాయన్నది నిజం.