Subham Collections : ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు జెస్సీగా పరిచయమైంది సమంత. మొదటి సినిమాతోనే చాలామందిని ఆకర్షించింది. ఆ సినిమా హిట్ కావడంతో సమంతకు వరుసగా తెలుగులో అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఒక టైం లో సమంత టాప్ హీరోయిన్ అని అనిపించుకుంది. సమంత చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన దూకుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన అత్తారింటికి దారేది సినిమాలు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ రికార్డులను నమోదు చేసుకున్నాయి. కేవలం వీళ్ళతో మాత్రమే కాకుండా ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలతో కూడా సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకుంది. వరుస హిట్స్ పడుతుండటంతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి కూడా సిద్ధమైంది. ఇక ప్రస్తుతం నిర్మాతగా కూడా అడుగులు వేయడం మొదలుపెట్టింది సమంత.
లేడీ ఓరియంటెడ్ సినిమాలు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాలు చూసే మైండ్ సెట్ ఆడియన్ కి కంప్లీట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒకప్పుడు సినిమా అంటే వినోదం అని ఫీలయ్యే వాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు ఒక కొత్త కాన్సెప్ట్ సినిమా ఎవరు చేసినా కూడా దానిని ఎంకరేజ్ చేయటానికి ఎప్పుడూ తెలుగు ఆడియన్స్ ముందుంటారు అని కొన్ని రోజుల నుంచి నిరూపిస్తూ వస్తున్నారు. సమంత కూడా చాలామంది టాప్ హీరోయిన్స్ ల లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ సక్సెస్ అయింది. కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా వెబ్ సిరీస్ కూడా చేసి ఇండియా వైడ్ గుర్తింపు సాధించుకుంది. సమంత చేసిన ఫ్యామిలీ మెన్ సిరీస్ తనకు మంచి పేరును తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం సమంతా కి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది చెప్పాలి.
ప్రొడ్యూసర్ గా సక్సెస్
లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న సమంత తను కూడా కొన్ని మంచి కథలను చెప్పాలి అనే నిర్ణయంతో నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శుభం అనే సినిమాను నిర్మించింది. గత రెండు రోజుల ముందే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి. ఇక్కడితో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ మొదలైంది. నిన్న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాకి దాదాపు నాలుగు కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారు. అయితే ఈ సినిమాకు ఇప్పటికే ఒకటిన్నర కోటి కలెక్షన్స్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఓటిటి డీల్స్ అన్నీ కలిపి సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. ఒక మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వస్తే ఆదరిస్తారు అని చెప్పడానికి ఈ సినిమా మరో ఉదాహరణ.
Also Read : Basheer Master: ప్రవస్తి విషయంలో కీరవాణిదే తప్పు.. నోటి దూల తగ్గించుకుంటే మంచిదంటూ..?