IOB Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో పలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ (IOB) ఖాళీగా ఉన్న లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 12వ తేదీ నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 400
ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ (IOB)లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (ఎల్‌బీఓ): 400
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులక పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 12
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 31
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://iob.in/Careers
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: IOCL Recruitment: పదితో ఐవోసీఎల్‌లో 1770 ఉద్యోగాలు.. స్టైఫండ్ కూడా ఇస్తారు.. లాస్ట్ డేట్?
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 400
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 31
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
జీతం: రూ.48,480 నుంచి రూ.85,920
Also Read: AAI Recruitment: డిగ్రీతో ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000 జీతం